సముద్ర గర్భాన మంచినీరు

ఆకాశమే హద్దుగా మానవ మేధస్సు దినదినాభివృద్ధి చెందుతూ సరి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నది. ఇతర గ్రహాలపై కూడా మానవ

Update: 2022-09-17 18:30 GMT

సముద్రపు అట్టడుగున మంచినీటి జలధారలు ఏర్పడడానికి రెండు కారణాలు ఉండవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. 15, 20 వేల సంవత్సరాల క్రితం మంచు యుగం చివరలో ప్రపంచంలోని అధిక భాగం నీరు దాదాపు ఒక మైలు లోతు మంచుతో కప్పబడిపోయిందని, అది ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని ఉత్తర న్యూజెర్సీ, లాంగ్ ఐలాండ్, న్యూ ఇంగ్లాండ్ తీరప్రాంతాలకు విస్తరించి ఉండవచ్చని అంటున్నారు. అప్పుడు సముద్ర మట్టాలు చాలా తక్కువగా ఉండేవి. మంచు కరిగినప్పుడు డెల్టా ప్రాంతాలలో నీరు నిలువ ఉండిపోయింది. కాలక్రమేణా సముద్ర మట్టాలు పెరిగాయి. మంచి నీటి జలధారలకు అలా నిక్షిప్తమైన నీరే కారణమని ఇంతవరకు భావించేవారు. భూగర్భ ప్రవాహం ద్వారా కూడా జలధారలు ఏర్పడుతాయని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

కాశమే హద్దుగా మానవ మేధస్సు దినదినాభివృద్ధి చెందుతూ సరి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నది. ఇతర గ్రహాలపై కూడా మానవ నివాసానికి గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్న సమయంలో కూడా ఈ అనంత సృష్టిలోని ఎన్నో అద్భుతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మానవ మనుగడకు నీరు అందునా సురక్షిత మంచి నీరు ఎంతో విలువైనది. సురక్షిత మంచి నీరు అలభ్యత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నో రుగ్మతలకు, అనారోగ్యాలకు గురవుతున్నారు. అమెరికా ఈశాన్య కోస్తా ప్రాంతంలో సముద్రపు అట్టడుగు భాగాన జరిపిన అధ్యయనంలో ఉప్పు నీటి క్రింద అతి భారీ పరిమాణంలో మంచినీటి జలధారలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

సముద్ర గర్భాన ఇప్పటివరకు భారీ పరిమాణంలో వెలుగు చూసిన తొలి మంచి నీటి జలధార ఇది. మసాచుసెట్స్ తీర ప్రాంతం నుంచి న్యూజెర్సీ వరకు విస్తరించి ఉంది. భూ ఉపరితంలో చెప్పాలంటే దాదాపు 15 వేల చదరపు మైళ్ల వైశాల్యంలో ఉంటుంది. ఇలాంటి మంచి నీటి జలధారలు మరిన్ని సముద్రగర్భాలలో ఉండవచ్చని, వీటి ద్వారా కరువు పీడిత ప్రాంతాలకు మంచి నీటిని అందించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రజ్ఞులు ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ కెరటాల ద్వారా నీటి జలధారలను అంచనా వేశారు. అధ్యయన బృందానికి క్లో గుస్టాఫ్సన్ సారధ్యం వహించారు. 18 జూన్ 2019న 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో వివరాలను ప్రచురించారు.

ఎప్పుడు, ఎలా తెలిసింది?

1970 తొలి రోజులలో తీర ప్రాంతాలలో చమురు నిక్షేపాల కోసం సముద్ర గర్భంలో సూక్ష్మ రంధ్రాలు చేసినప్పుడు పలు సందర్భాలలో చమురుకు బదులుగా మంచి నీరు చిమ్మింది. దీంతో అక్కడ మంచినీటి జలధారలేమైనా ఉన్నాయా? అనే చర్చ మొదలైంది. 23 సంవత్సరాల క్రితం కొలంబియా విశ్వవిద్యాలయంలోని ల్యామొంట్ డోహర్తి ఎర్త్ అబ్జర్వేటరీలో క్లో గుస్టాఫ్సన్ సహచరుడు కెర్రీ కీ సాగర గర్భంలో చమురు జాడలు కనుగొనేందుకు ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ సాంకేతికత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసారు. 2015లో ఆయన రాబ్ ఎల్ ఈవాన్స్‌తో కలిసి పది రోజులు ఓ పరిశోధక నౌకలో గడిపారు. ఈ సమయంలోనే అక్కడ భారీ మంచి నీటి అవక్షేపాలున్నాయని కనుగొన్నారు.

సౌర తుఫానులు, పిడుగుపాటులు సంభవించినప్పుడు ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాల ద్వారా ఏర్పడే ప్రతిధ్వనిని అంచనా వేయడానికి వారు సముద్ర గర్భానికి రిసీవర్లను పంపారు. ఈ అధ్యయనం ద్వారానే మంచి నీటి ధారలు తీర ప్రాంతం నుండి చాలా దూరం వరకు విస్తారంగా ఉన్నాయని తేలింది. ఇవి చాలా వరకు సముద్ర గర్భం ఉపరితలం క్రింద 600 అడుగుల నుంచి 1,200 అడుగుల వరకు ఉన్నాయని తెలిసింది. ఇవి రోడ్ ఐలాండ్, కనెక్టికట్, న్యూయార్క్ ప్రాంతాలలో కూడా ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాలలో కనీసం 670 ఘనపు మైళ్ల మంచినీటి జలధారలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇవి ఉత్తరం, దక్షిణానికి కూడా విస్తరించినట్లు నిర్ధారణ అయితే, అవి దక్షిణ డకోటా నుంచి టెక్సాస్ వరకు భూగర్భ జలాలను అందించగలిగే సామర్థ్యం కలిగి ఉంటామయని అన్నారు. ఇది ప్రతి యేటా భూ ఉపరితలం నుంచి ఆవిరయ్యే నీటి పరిమాణం కంటే ఎక్కువ.

ఎలా ఏర్పడ్డాయి?

సముద్రపు అట్టడుగున మంచినీటి జలధారలు ఏర్పడడానికి రెండు కారణాలు ఉండవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. 15, 20 వేల సంవత్సరాల క్రితం మంచు యుగం చివరలో ప్రపంచంలోని అధిక భాగం నీరు దాదాపు ఒక మైలు లోతు మంచుతో కప్పబడిపోయిందని, అది ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని ఉత్తర న్యూజెర్సీ, లాంగ్ ఐలాండ్, న్యూ ఇంగ్లాండ్ తీరప్రాంతాలకు విస్తరించి ఉండవచ్చని అంటున్నారు. అప్పుడు సముద్ర మట్టాలు చాలా తక్కువగా ఉండేవి. మంచు కరిగినప్పుడు డెల్టా ప్రాంతాలలో నీరు నిలువ ఉండిపోయింది. కాలక్రమేణా సముద్ర మట్టాలు పెరిగాయి. మంచి నీటి జలధారలకు అలా నిక్షిప్తమైన నీరే కారణమని ఇంతవరకు భావించేవారు. భూగర్భ ప్రవాహం ద్వారా కూడా జలధారలు ఏర్పడుతాయని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

వర్షాలు పడినప్పుడు సముద్రపు ఒడ్డున భూమిలోకి ఇంకిన నీరు ఆటుపోటుల ఒత్తిడి ద్వారా సముద్ర గర్భానికి చేరుకుంటుందని కెర్రీ కీ తెలిపారు. సాధారణంగా సముద్రపు ఒడ్డున ఉండే జలధారలు లోపలికి వెళ్లే కొద్దీ ఉప్పగా ఉంటాయని అన్నారు. సముద్రపు ఒడ్డున ఉండే సాగర గర్బంలోని భూసంబంధ తాజా నీరు వెయ్యిలో ఒక వంతుకన్నా తక్కువ ఉప్పదనం కలిగి ఉంటుందని, బాహ్యపు అంచులకు చేరే సరికి ఇది దాదాపు 15 శాతం ఉంటుందని తెలిపారు. ఈ జలధారను వివిధ అవసరాల కోసం వినియోగించవలసి వస్తే అందులోని లవణాలను నిర్మూలించడానికి సాధారణ సముద్రపు నీటిని శుద్ధి చేయడానికి అవసరమయ్యే ఖర్చుకున్నా అతి తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు.


యేచన్ చంద్రశేఖర్

88850 50822

Tags:    

Similar News