వందేళ్ళ చరిత్ర ఉన్న సిటీ కాలేజ్ గురించి తెలుసా
నిలువెల్లా జాజి రంగు నికారు. గంభీరమైన భవంతులు, ఎత్తయిన ప్రాకారాలు. ఇదంతా ఏ కోట గురించో అనుకుంటే పొరపాటే. ఉజ్వల భవిష్యత్,
ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ 1919లో ఈ భవనాన్ని ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. అపుడు ఇందులో 'మదర్సా-ఎ దారుల్-ఉలుం'ను ప్రారంభించారు. తరువాత దీనిని సీటీ హైస్కూల్‌గా మార్చి కొత్తగా నిర్మించిన భవనంలోకి తరలించారు. 1921లో 30 మంది విద్యార్థులతో ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్‌ను ప్రారంభించారు. తదనంతరం ప్రీ యూనివర్సిటీ కోర్సులను ప్రవేశపెట్టారు. 1967లో బీఏ, బీకాం తదితర విభాగాలతో ఇది పూర్తిస్థాయి డిగ్రీ కళాశాలగా రూపుదిద్దుకుంది. 2000 సంవత్సరం నుంచి పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి. 2004-05 విద్యా సంవత్సరంలో కళాశాలకు స్వయం ప్రతిపత్తి లభించింది.
నిలువెల్లా జాజి రంగు నికారు. గంభీరమైన భవంతులు, ఎత్తయిన ప్రాకారాలు. ఇదంతా ఏ కోట గురించో అనుకుంటే పొరపాటే. ఉజ్వల భవిష్యత్, ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హైదరాబాద్ నగరంలోని సిటీ కాలేజ్ అది. నిజాం రాజుల రాజసానికి, దక్కన్ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దంగా మారి ఘనచరిత్రను సొంతం చేసుకున్న శత వసంతాల కళాశాల. దేశ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది. ఎందరో మహానుభావులకు చదువు నేర్పించింది.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో విద్యార్థి ఉద్యమాలకు ఊపిరి పోసింది నయాపూల్ మూసీ నది ఒడ్డున నిర్మితమైన ఈ కళాశాల జ్ఞాన మహావృక్షం సమక్షంలో చదువు నేర్చిన ఎందరో విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలుగా ఎదిగారు. ఇంకా ఎన్నో రంగాలలో ఉండి దేశ పురోభివృద్ధికి, సామాజిక ప్రగతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ కళాశాల భవనాలకు ఇండో-పారసీక శైలిలో ప్రఖ్యాత బ్రిటిష్ వాస్తు శిల్పి విన్సెంట్. హెచ్ రూపకల్పన చేశారు. చీఫ్ ఇంజనీర్ నవాబ్ ఖాన్ బహదూర్ మిర్జా అక్బర్ బేగ్ పనులను పర్యవేక్షించారు.
సిటీ కళాశాల చరిత్ర
ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ 1919లో ఈ భవనాన్ని ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. అపుడు ఇందులో 'మదర్సా-ఎ దారుల్-ఉలుం'ను ప్రారంభించారు. తరువాత దీనిని సీటీ హైస్కూల్‌గా మార్చి కొత్తగా నిర్మించిన భవనంలోకి తరలించారు. 1921లో 30 మంది విద్యార్థులతో ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్‌ను ప్రారంభించారు. తదనంతరం ప్రీ యూనివర్సిటీ కోర్సులను ప్రవేశపెట్టారు. 1967లో బీఏ, బీకాం తదితర విభాగాలతో ఇది పూర్తిస్థాయి డిగ్రీ కళాశాలగా రూపుదిద్దుకుంది. 2000 సంవత్సరం నుంచి పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి.
2004-05 విద్యా సంవత్సరంలో కళాశాలకు స్వయం ప్రతిపత్తి లభించింది. ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది, ప్రస్తుతం తెలంగాణలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థగా మన్ననలు అందుకుంటున్నది. ప్రస్తుతం కళాశాలలో 4,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డిగ్రీ స్థాయిలోనే బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ లాంటి తక్షణ ఉపాధి కల్పించే అరుదైన కోర్సులు ఉన్నాయి. 55 రకాల కోర్సులను అందిస్తున్నారు. డిగ్రీ స్థాయిలోనే ఇన్ని కోర్సులను అందిస్తున్న విద్యాసంస్థ దేశంలోనే మరోకటి లేదు. ఇందులోనే ఐదు పీజీ కోర్సులు సైతం ఉన్నాయి. ఈ కళాశాలలో 80 వేలకు పైగా వివిధ గ్రంథాలు, అధునాతన సౌకర్యాలు కలిగిన అతిపెద్ద గ్రంథాలయం ఉంది.
సంప్రదాయం పాటించి
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం నెరవేరాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో 2012 నుంచి కళాశాలలో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పించే సాంప్రదాయం మొదలైంది. రాష్ట్రం సిద్ధించినా ఆపకుండా నేటి వరకు దానిని కొనసాగిస్తూనే ఉన్నాం. దీంతో పాటు బంజారా సంస్కృతిలో జరిగే తీజ్ పండగను జరుపుతాం. సిటీ కళాశాల 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు ఐడీ కార్డుల మంజూరులో ఏబీవీపీ ప్రముఖ పాత్ర పోషించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రొఫెసర్ ఝాన్సీ గారు టీఎస్ కేసీ ల్యాబ్ ద్వారా విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలోనూ రాణించేందుకు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులలో క్రమశిక్షణ, సామాజిక సేవా స్ఫూర్తి పెంపొందించే NCC, NSS, మహిళా సాధికారక కేంద్రం తదితర విభాగాలు ఉన్నాయి.
సభావత్ కళ్యాణ్
ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ వనవాసి కన్వీనర్
90143 22572