పౌర సమాజం ఏకం కావాలి
దేశ ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ కార్మికులు ఎంతో కష్టపడి ఏర్పరుచుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు.
ఈ సమ్మెలో ఒకటీ రెండు సంఘాలు తప్ప పది జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పాల్గొంటున్నాయి. ప్రధానంగా ఈ సమ్మె ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు నిరసన, రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా జరుగుతోంది. ఇప్పటికే నష్టపోయామని శ్రామికవర్గం భావిస్తున్న వేళ 'మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ' చందంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో గెలిచామనో ఏమో కానీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) మీద వడ్డీ కోతకు కూడా ప్రభుత్వం సిద్ధపడింది. ఈ నిర్ణయం ద్వారా ఆరున్నర కోట్ల సభ్యుల కుటుంబాల మీద పడుతుంది.
దేశ ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ కార్మికులు ఎంతో కష్టపడి ఏర్పరుచుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికులను, ఉద్యోగులను కట్టుబానిసలుగా మార్చేందుకు పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇది కార్మికుడిపై ప్రభుత్వం చేసే దాడి అనక తప్పదు. స్వాతంత్రం తరువాత కార్మికవర్గం మీద ఇంత పెద్ద దాడి ఎప్పుడూ జరగలేదు.
మొత్తం వ్యవస్థను మార్చే కొత్త లేబర్ కోడ్‌లు, హక్కులు లేనటువంటి చట్టాలను అమలులోకి తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చి వేసే ప్రయత్నం జరుగుతోంది. రూల్స్ ఫ్రేమ్ చేసుకుని కొత్త లేబర్ కోడ్లను అమలు చేసే రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామని కేంద్రం ఊరిస్తున్నది. ఇది మోడీ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం. నాలుగు లేబర్ కోడ్‌లు అమలైతే చెప్పుకోవడానికి పనికి వస్తాయి. ఆచరణలో ఎందుకూ పనికి రావని, కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరమని భావించిన కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. నిజానికి ఫిబ్రవరి 23, 24 తేదీలలోనే సమ్మె నిర్వహించాలనుకున్నారు. కరోనా పరిస్థితి, ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా కుదరలేదు. అందుకే కొత్త లేబర్ కోడ్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఏప్రిల్ ఒకటో తారీఖు కంటే ముందు మార్చి 28,29 తేదీలలో సమ్మె చేయడానికి నిర్ణయించారు.
సమాయత్తమైన సంఘాలు
ఈ సమ్మెలో ఒకటీ రెండు సంఘాలు తప్ప పది జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పాల్గొంటున్నాయి. ప్రధానంగా ఈ సమ్మె ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు నిరసనగా, రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా జరుగుతోంది. ఇప్పటికే నష్టపోయామని శ్రామికవర్గం భావిస్తున్న వేళ 'మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ' చందంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో గెలిచామనో ఏమో కానీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) మీద వడ్డీ కోతకు కూడా ప్రభుత్వం సిద్ధపడింది. ఈ నిర్ణయం ద్వారా ఆరున్నర కోట్ల సభ్యుల కుటుంబాల మీద పడుతుంది. కార్మికుల సొమ్ము మీద, శ్రమ, కష్టార్జితం మీద ఈ నిర్ణయం ప్రతికూలత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో సమ్మె అనివార్యమయింది. నూతన పారిశ్రామిక విధానాలు అమలులోకి వచ్చాక ఇది 21 వ సమ్మె.
సార్వభౌమాధికారానికి ప్రమాదం
ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్లు లేబర్ కోడ్‌లు రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలి. ఏడవ పే కమిషన్ సూచించిన విధంగా మినిమం వేజెస్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించాలి. కార్మికులకు మినిమం 26 వేల రూపాయలు వేతనం అమలులోకి తేవాలి. ఇపుడు 15 వేల రూపాయల లోపే సగటు కార్మికుడి జీతం ఉంది. కనీస వేతనం కావాలని కార్మికవర్గం ఎప్పటి నుంచో పోరాడుతున్నది. కరోనా సమయంలో మరణించిన వారికి ప్రకటించిన సొమ్మును వెంటనే ఇవ్వాలి.
'ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా డబ్బును సేకరించబోతున్నాం' అని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. దీని వలన, దేశ సార్వభౌమాధికారం మొత్తం ప్రమాదంలో పడుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జరుగనున్న జాతీయ సమ్మె చాలా ప్రాధాన్యమైనది గా భావించాలి. యావత్ పౌర సమాజం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉద్యోగులు, కార్మిక సంఘాలు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి.
మందా వెంకటేశ్వర్లు
ఏఐటీయూసీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి
94417 75596