టెట్ పేపర్ -2 సిలబస్ మార్చండి!
జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (NCTE) ఉత్తర్వుల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణ చేస్తున్నాయి..

జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (NCTE) ఉత్తర్వుల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణ చేస్తున్నాయి.. NCTE రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ పరీక్ష నిర్వహణ చేస్తున్నాము అని చెప్తున్నప్పటికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.. డిగ్రీ, డి.ఎడ్ చేసిన వారికి టెట్ పేపర్ -2లో NCTE పరిధిలో జరిగే కేంద్ర టెట్‌లో అనుమతి ఇస్తున్నారు.. కానీ మన రాష్ట్రంలో వారిని అనుమతించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సార్లు అనుమతి ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే టెట్‌పై సమీక్ష జరిపి ఈ లోపాన్ని సవరించాలి.. అలాగే టెట్ పేపర్- 2లో బయోలజీ అభ్యర్థులకు మ్యాథ్స్ ప్రశ్నలు ఇవ్వడం వల్ల వేలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల్లో బయోలజీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్‌లకు వేర్వేరు పరీక్షలు ఉన్నప్పుడు టెట్‌లో మాత్రం మాథ్స్, సైన్స్ కలిపి పరీక్ష నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు టెట్‌లో ఫెయిల్ అవుతున్నారు. పాస్ అయిన కొందరు అభ్యర్థులు చాలా మార్కులు కోల్పోతున్నారు.. కాబట్టి మ్యాథ్స్, బయో సైన్స్ అభ్యర్థులకు వేర్వేరు టెట్ పరీక్షలు నిర్వహించాలి. అలాగే భాష పండితులకు కూడా వారి సబ్జెక్ట్ లోనే టెట్ నిర్వహించాలి. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు కూడా ప్రత్యేక టెట్ నిర్వహించాలి. టెట్ పేపర్- 1లో 8వ తరగతి లోపే ప్రశ్నలు ఉండే విధంగా, టెట్ పేపర్ -2 వారికి పదవ తరగతి లోపే ప్రశ్నలు ఉండేలా టెట్ పేపర్ -2 సిలబస్ మార్చండి!. సైకాలజీ లాంటి అంశాల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల నుండి కాకుండా ప్రైవేట్ మెటీరియల్ ప్రశ్నలు ఇవ్వడం సరికాదు. ఇక టీచర్ల ప్రమోషన్స్‌లో కూడా టెట్ వెయిటేజీ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- రావుల రామ్మోహన్ రెడ్డి
93930 59998