మధ్యతరగతి వద్దకు 'భారత్ రైస్'

'Bharat Rice' to the Middle Class

Update: 2024-02-09 00:15 GMT

దేశంలో బహిరంగ మార్కెట్ లోకి 'భారత్ రైస్' పేరిట బియ్యంను కేంద్రం ప్రభుత్వం మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. బియ్యాన్ని ఐదు, పది కేజీల సంచుల్లో రూ.29 కే కేజీ అందివ్వడం మధ్యతరగతి ప్రజలకు ధరల విషయంలో భారీ ఊరట కలిగిస్తుంది. దేశంలో సన్నబియ్యం తినలేని స్థితిలో మధ్య తరగతి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ బియ్యంతోనే ఏళ్లుగా పొట్ట నింపుకుంటున్నారు. తాజాగా 'భారత్ రైస్'ను అందుబాటులోకి తీసుకువచ్చి.. సన్న బియ్యం తినాలనే వారి ఆకాంక్షను కేంద్రం నెరవేర్చినట్లయింది. అదేవిధంగా బియ్యం ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న వాళ్లకి ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

ఇకపోతే భారత్ రైస్ ద్వారా భవిష్యత్‌లో నాణ్యత గల బియ్యం మార్కెట్ లోకి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలి. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి. ప్రారంభ దశలో ఎలాంటి బియాన్నైతే అందిస్తున్నారో.. అదేవిధంగా ఎప్పుడూ అందించాలి. ప్రజల్లో భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకత రాకుండా జాగ్రత్త వహించాలి. బియ్యంపై ఎక్కడైనా ఫిర్యాదులు అందితే.. ఆయా శాఖలు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలి.

- తలారి గణేష్

99480 26058

Tags:    

Similar News