జీవీకే కంపెనీకి బిగుస్తోన్న ఉచ్చు !
దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఎయిర్‌పోర్టు స్కామ్‌లో ఉచ్చు బిగుస్తోంది. జీవీకే గ్రూపు అవకతవకలపై విచారణ చేస్తున్న ఈడీ అధికారులు ముంబై, హైదరాబాద్ కార్యాలయాల్లో ఏకకాలంలో 9చోట్ల సోదాలు చేపట్టారు. జీవీకే, సంజయ్‌రెడ్డి, జీవీకే కార్పొరేట్ ఆఫీస్‌తో పాటు పింకిరెడ్డి ఆర్బిట్ ట్రావెల్స్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఈడీ.. సీబీఐ సేకరించిన వివరాలు తమకు అందించాలని కోరింది. జూన్ 27న 14మందిపై కేసులు చీటింగ్, ఫ్రాడ్ వంటి అభియోగాలు నమోదుకాగా 2012లో […]
దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఎయిర్‌పోర్టు స్కామ్‌లో ఉచ్చు బిగుస్తోంది. జీవీకే గ్రూపు అవకతవకలపై విచారణ చేస్తున్న ఈడీ అధికారులు ముంబై, హైదరాబాద్ కార్యాలయాల్లో ఏకకాలంలో 9చోట్ల సోదాలు చేపట్టారు. జీవీకే, సంజయ్‌రెడ్డి, జీవీకే కార్పొరేట్ ఆఫీస్‌తో పాటు పింకిరెడ్డి ఆర్బిట్ ట్రావెల్స్‌లోనూ తనిఖీలు చేస్తున్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఈడీ.. సీబీఐ సేకరించిన వివరాలు తమకు అందించాలని కోరింది.
జూన్ 27న 14మందిపై కేసులు చీటింగ్, ఫ్రాడ్ వంటి అభియోగాలు నమోదుకాగా 2012లో రూ.395కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐ విచారణలో వెల్లడైంది. కాగా 9బోగస్ కంపెనీలకు జీవీకే నిధులు మళ్లించినట్టు సీబీఐ గుర్తించింది. రూ. 800 కోట్ల రూపాయల నిధులను జీవీకే కంపెనీ మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.