హుజూరాబాద్ పోలింగ్ అలాగే జరగాలి.. ఈసీ కీలక ఆదేశాలు
దిశ. కాళోజీ జంక్షన్: ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్‌లు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన […]
దిశ. కాళోజీ జంక్షన్: ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్‌లు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌తో పాటు, హెల్త్ డెస్కులు ఉండేలా చూడాలని అన్నారు. ఓటర్ల కోసం వీల్ చైర్‌లు, మంచినీరు, విద్యుత్ ఉండేలా చూడాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహించాలని స్పష్టం చేశారు. సీ-విజిల్ మొబైల్ యాప్ ద్వారా వచ్చే కంప్లైంట్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ పుష్పా, డీఎం అండ్ హెచ్‌ఓ లలితాదేవి, ఎన్నికల సూపరింటెండెంట్ రాణి, డీటీ రామారావు తదితరులు పాల్గొన్నారు.