కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender )సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను (KTR) సీఎం చేద్దామనుకుంటే.. కేసీఆర్ (KCR)కు ఇది కుటుంబ పార్టీ కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కింద పనిచేసేందుకు గతంలో హరీశ్ రావు (Thanneeru Harish Rao), తాను కూడా ఒప్పుకున్నామని గుర్తు చేసిన ఈటల.. ఇప్పుడు సహించేది లేదన్నారు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం ఏర్పాటు అయిందని.. ఇప్పుడు […]
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajender )సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను (KTR) సీఎం చేద్దామనుకుంటే.. కేసీఆర్ (KCR)కు ఇది కుటుంబ పార్టీ కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కింద పనిచేసేందుకు గతంలో హరీశ్ రావు (Thanneeru Harish Rao), తాను కూడా ఒప్పుకున్నామని గుర్తు చేసిన ఈటల.. ఇప్పుడు సహించేది లేదన్నారు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం ఏర్పాటు అయిందని.. ఇప్పుడు ఉద్యమకారులే కన్నీళ్లు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. కేసీఆర్ తీరుతో ఇంటివాడు బయటకు పోతే.. బయటి వాళ్లు ఇంట్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీచపు బుద్ధితోనే తనపై తప్పుడు రాతలు రాయించి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రగతి భవన్‌ను ఉద్దేశిస్తూ.. అది బానిస భవన్ అంటూ ఈటల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బానిస కంటే అధ్వాన్నంగా మంత్రుల పదవులు ఉన్నాయని.. అవి ఉండి ఎందుకన్నారు. గతంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కూడా అవమానం చేశారని.. రాష్ట్ర అభివృద్ధి కోసమే అవమానాలు భరించామన్నారు. సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఐఏఎస్‌లు లేరని ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. పార్టీకి రాజీనామా అనంతరం ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి.