ఈటల TRS నేతనే.. కేసీఆర్ పక్కనే రాజేందర్ ఫోటోతో షేర్ కార్డ్ వైరల్

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడిని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటలను ఓడించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే ఈ నాయకులు మాత్రం ఇంకా తమ ముఖ్య నాయకుల్లో ఒకరని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అధ్యక్షురాలు ఎం. […]

Update: 2021-08-07 00:57 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడిని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటలను ఓడించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే ఈ నాయకులు మాత్రం ఇంకా తమ ముఖ్య నాయకుల్లో ఒకరని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అధ్యక్షురాలు ఎం. స్వర్ణలత, ఆమె భర్త రాజనర్సింగరావు శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ తయారు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిలో ఫోటోలు ముద్రించారు.

ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినని ప్రచారం చేసుకుంటుంటే ఇంకా టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆయన తమ పార్టీ నాయకుడే అని ఓన్ చేసుకుంటుండడం విశేషం. ఇటీవల కొడిమ్యాల మండలం పూడురులోని ఖాదీ భండార్ భూములను కొనుగోలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న నాయకుడే చేనేత కార్మికులకు శుభాకాంక్షలు చెబుతుండటంపై కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News