అరుణాచల్‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు
దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. చాంగ్లాంగ్‌లో బుధవారం తెల్లవారుజామున 1.25 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సొస్మోలజీ (NCS)వెల్లడించింది. చాంగ్లాంగ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. కాగా, అంతకు ముందు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ నెల 9న […]
దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. చాంగ్లాంగ్‌లో బుధవారం తెల్లవారుజామున 1.25 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సొస్మోలజీ (NCS)వెల్లడించింది. చాంగ్లాంగ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. కాగా, అంతకు ముందు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ నెల 9న తక్కువ తీవ్రతతో భూకంపం వచ్చింది.