మణిపూర్‌లో భూకంపం

గువహతి: మణిపూర్‌లో సోమవారం రాత్రి సుమారు 8.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంప ప్రభావం గువహతి, అసోం, మేఘాలయా, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరంలోని పలు ప్రాంతాల్లో కనిపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో భూమి కంపించడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మొయిరాంగ్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో 27.5 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది.

Update: 2020-05-25 10:21 GMT

Tags:    

Similar News