ఆస్తిప‌న్ను బ‌కాయిదారుల‌కు ఎర్లీబ‌ర్డ్ రాయితీ

దిశ, న్యూస్‌బ్యూరో: నివాస‌, వాణిజ్య, బ‌హుళ వినియోగ ఆస్తుల‌కు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నును ఈ నెల 31లోపు చెల్లించి 5శాతం ఎర్లీబ‌ర్డ్ రాయితీ పొందాల‌ని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ విజ్ఞ‌ఫ్తి చేశారు. ఆస్తిప‌న్ను బ‌కాయిదారుల‌కు ఎర్లీబ‌ర్డ్ రాయితీ సమాచారం పంపించామని ఆయన తెలిపారు. నగరంలోని య‌శోద కార్పొరేట్ హాస్పిట‌ల్స్‌కు సంబంధించిన రూ.2కోట్ల 67ల‌క్ష‌ల 30వేల ఆస్తి పన్నులో 5శాతం ఎర్లీబ‌ర్డ్ రాయితీ కింద రూ. 14.29 లక్షలు పోనూ మిగిలిన రూ. […]

Update: 2020-05-27 05:58 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: నివాస‌, వాణిజ్య, బ‌హుళ వినియోగ ఆస్తుల‌కు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నును ఈ నెల 31లోపు చెల్లించి 5శాతం ఎర్లీబ‌ర్డ్ రాయితీ పొందాల‌ని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ విజ్ఞ‌ఫ్తి చేశారు. ఆస్తిప‌న్ను బ‌కాయిదారుల‌కు ఎర్లీబ‌ర్డ్ రాయితీ సమాచారం పంపించామని ఆయన తెలిపారు. నగరంలోని య‌శోద కార్పొరేట్ హాస్పిట‌ల్స్‌కు సంబంధించిన రూ.2కోట్ల 67ల‌క్ష‌ల 30వేల ఆస్తి పన్నులో 5శాతం ఎర్లీబ‌ర్డ్ రాయితీ కింద రూ. 14.29 లక్షలు పోనూ మిగిలిన రూ. 2.51 కోట్ల ఆస్తిప‌న్నును చెల్లించారు. సంబంధిత చెక్‌ను జీహెచ్‌ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌కు య‌శోద హాస్పిట‌ల్స్ పీఆర్వో చంద్ర‌శేఖ‌ర్ అంద‌జేశారు.

Tags:    

Similar News