‘దుష్యంత్ చౌతలా రాజీనామా నా జేబులో ఉంది’
చండీగఢ్: హర్యానాలో అధికారంలోని మనోహర్‌లాల్ ఖట్టార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ల నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతలా తండ్రి అజయ్ చౌతలా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దుష్యంత్ చౌతలా రాజీనామా నా జేబులో ఉన్నది. ఆయన రాజీనామాతో రైతుల డిమాండ్లకు ఏ రీతిలోనైనా పరిష్కారం లభిస్తుందంటే క్షణంలోనే ఇచ్చేస్తా. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి వాటిని కేంద్రమే రద్దు చేయాలి. రాజీనామాల విషయానికి వస్తే, ఈ చట్టాలను […]
చండీగఢ్: హర్యానాలో అధికారంలోని మనోహర్‌లాల్ ఖట్టార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ల నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతలా తండ్రి అజయ్ చౌతలా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దుష్యంత్ చౌతలా రాజీనామా నా జేబులో ఉన్నది. ఆయన రాజీనామాతో రైతుల డిమాండ్లకు ఏ రీతిలోనైనా పరిష్కారం లభిస్తుందంటే క్షణంలోనే ఇచ్చేస్తా. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి వాటిని కేంద్రమే రద్దు చేయాలి. రాజీనామాల విషయానికి వస్తే, ఈ చట్టాలను లోక్‌సభలో ఆమోదించిన 10 మంది హర్యానా ఎంపీలు, రాజ్యసభలో ఆమోదించిన ఐదుగురు ఎంపీలు ముందుగా రిజైన్ చేయాలి. దుష్యంత్ రాజీనామా లేదా రాష్ట్ర మంత్రుల రాజీనామాతో ఏమీ ఒరగదని అన్నారు. ఇది వరకు చెప్పినట్టు దుష్యంత్ రాజీనామాతో సమస్య పరిష్కృతమవుతుందంటే వెంటనే సమర్పిస్తా. ఆయన రాజీనామా నా జేబులో సిద్ధంగా ఉన్నది.