నో స్టాక్… కరోనా ఎఫెక్ట్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్-19) దాదాపు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుండగా..సూపర్ మార్కెట్లకు మాత్రం మంచి ఆదాయాన్నస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఆదివారం బంద్ ప్రకటించాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో..ప్రజలు ఇంటికి అవసరమైన అన్నివస్తువులను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన రీటైల్ వ్యాపారం.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా పలు సంస్థలు వ్యాపార సముదాయాలను బంద్ చేయాలని ఆదేశించినా.. నిత్యవసరాలు లభించే సూపర్ మార్కెట్లను మినహాయించారు. అయితే ఈ మూడ్రోజుల వ్యవధిలో రీటైల్ […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్-19) దాదాపు అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుండగా..సూపర్ మార్కెట్లకు మాత్రం మంచి ఆదాయాన్నస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఆదివారం బంద్ ప్రకటించాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో..ప్రజలు ఇంటికి అవసరమైన అన్నివస్తువులను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు.
పెరిగిన రీటైల్ వ్యాపారం..
కరోనా నివారణ చర్యల్లో భాగంగా పలు సంస్థలు వ్యాపార సముదాయాలను బంద్ చేయాలని ఆదేశించినా.. నిత్యవసరాలు లభించే సూపర్ మార్కెట్లను మినహాయించారు. అయితే ఈ మూడ్రోజుల వ్యవధిలో రీటైల్ వ్యాపారం 2–4 రెట్లు పెరిగింది. గతంలో అవసరమైన మేరకే కొనుగోళ్లు జరిపే వారనీ, ఇప్పుడు వారానికంటే ఎక్కువ కాలానికి అవసరమైన వస్తువులను కస్టమర్లు తీసుకెళ్తున్నారని సూపర్ బజార్ల నిర్వాహకులు చెబుతున్నారు. టిఫిన్స్ కోసం అవసరమైన పిండి, పిల్లలకు స్నాక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, పప్పులు వంటివి ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఆదివారం సూపర్ మార్కెట్లు కూడా మూత పడుతుండటంతో ముందుగానే పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు, ఆహార ఉత్పత్తుల అమ్మకాలు పెరిగిపోయాయి. నగరంలో బిగ్ బజార్, హెరిటేజ్, రిలయన్స్, స్పెన్సర్, మోర్, డీ– మార్ట్, రత్నదీప్, తరుణి మాల్స్ రీటైల్ రంగంలో పనిచేస్తున్నాయి. అన్ని కలిపి సుమారు 600 వరకూ ఉన్నాయి. సాధారణ రోజుల్లో రూ.50 వేలు బిజినెస్ చేసే తమ బ్రాంచ్లో శుక్ర, శనివారాల్లో ఒక్కో రోజు రూ.3 లక్షలపైగా వరకూ అమ్మకాలు జరిగాయని ఓ ప్రైవేటు రీటైల్ బ్రాంచ్ మేనేజర్ వివరిస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ వంటివి పూర్తిగా అయిపోయాయని ఆయన తెలిపారు. చాలా రీటైల్ బజార్లలో పిండి, పప్పుల నిల్వలు లేకుండా పోయినట్టు తెలుస్తోంది.
Tags : retail market, no stock, dmart, ratnadeep