మద్యం మత్తులో వరుడు.. వధువును పక్కకు నెట్టి కాబోయే అత్తగారి మెడలో

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లి అంటే వధువు కొంచెం భయముంటుంది. తల్లిదండ్రులను వదిలి కొత్త ఇంటికి వెళ్లాలి. అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని భయపడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ వరుడు పెళ్లి అంటే భయపడ్డాడు. ఆ భయం పోవడానికి కల్యాణ మండపానికి తప్పతాగి  వచ్చాడు. ఇక ఇంకేముంది.. మద్యం మత్తులో ఆ వరుడు చేసిన వీరంగం ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది. వివరాలలోకి వెళితే.. సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏ వింత జరిగినా ఇట్టే  […]

Update: 2021-06-03 23:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లి అంటే వధువు కొంచెం భయముంటుంది. తల్లిదండ్రులను వదిలి కొత్త ఇంటికి వెళ్లాలి. అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని భయపడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ వరుడు పెళ్లి అంటే భయపడ్డాడు. ఆ భయం పోవడానికి కల్యాణ మండపానికి తప్పతాగి వచ్చాడు. ఇక ఇంకేముంది.. మద్యం మత్తులో ఆ వరుడు చేసిన వీరంగం ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది. వివరాలలోకి వెళితే..

సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏ వింత జరిగినా ఇట్టే ప్రపంచమంతా తెలిసిపోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక పెళ్లి వీడియో ను నిరంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఆ వీడియో లో పెళ్లి కొడుకు తప్పతాగి కల్యాణ మండపానికి వచ్చాడు. తాగిన మత్తులో వధువు మెడలో వేయాల్సిన దందాను అత్తగారి మెడలో వేయబోయాడు. దీంతో చూసినవారందరు షాక్ అయ్యి వరుడును ఆపారు. ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేశారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే పడిపోయాడు. ఈ ఘటన తో పెళ్ళికి వచ్చినవారందరు వరుడు చేసిన ఘనకార్యాన్ని చూసి తలపట్టుకున్నారు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లంటే వరుడు భయపడి .. కొంచెం దైర్యం కోసం తాగి ఉంటాడులే అని కొంతమంది అంటుంటే.. పెళ్లిలోనే ఇలా తాగి వస్తే పెళ్లి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో అని మరికొందరు భయపడుతున్నారు.

Tags:    

Similar News