కర్ణాటకలో కోరలుచాచిన కొకైన్
బెంగళూరు: కర్ణాటకలో కొన్నేళ్ల క్రితం గంజాయి సరఫరా గుట్టుగా సాగేది. డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు నైట్‌లైఫ్ స్టైల్ విధానంతో మాదకద్రవ్యాల వ్యాపారం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కొకైన్ రాజ్యమేలుతున్నది. ఐదేళ్లకాలంలో కొకైన్ వినియోగం రాష్ట్రంలో దాదాపు రెండింతలకు పెరిగిందని రాష్ట్ర హోంశాఖ వర్గాలు వెల్లిడించాయి. ఒక్కగ్రాము కొకెయిన్‌కు నాణ్యతను బట్టి రూ. ఆరువేల నుంచి 12వేలు పలుకుతున్నదని వివరించాయి. నైజీరియాలాంటి ఆఫ్రికన్ దేశాల నుంచి గోవా, ముంబయిల గుండా దేశంలోని పలుప్రాంతాలకు సరఫరా […]
బెంగళూరు: కర్ణాటకలో కొన్నేళ్ల క్రితం గంజాయి సరఫరా గుట్టుగా సాగేది. డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు నైట్‌లైఫ్ స్టైల్ విధానంతో మాదకద్రవ్యాల వ్యాపారం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కొకైన్ రాజ్యమేలుతున్నది. ఐదేళ్లకాలంలో కొకైన్ వినియోగం రాష్ట్రంలో దాదాపు రెండింతలకు పెరిగిందని రాష్ట్ర హోంశాఖ వర్గాలు వెల్లిడించాయి. ఒక్కగ్రాము కొకెయిన్‌కు నాణ్యతను బట్టి రూ. ఆరువేల నుంచి 12వేలు పలుకుతున్నదని వివరించాయి.
నైజీరియాలాంటి ఆఫ్రికన్ దేశాల నుంచి గోవా, ముంబయిల గుండా దేశంలోని పలుప్రాంతాలకు సరఫరా అవుతున్నది. అలాగే, బెంగళూరుకు చేరుతున్నది. దక్షిణాసియా దేశాలకు బెంగుళూరు నుంచే సరఫరా అవుతున్నట్టు అధికారులు వివరించారు. దీంతో బెంగళూరులో కొకైన్, హెరాయిన్, ఓపియం, గాంజా లాంటి మత్తుపదార్థాల వినియోగం పెరుగుతున్నది. ఉన్నతవర్గాల విద్యార్థులు తొలుత వీటిని ఎక్కువగా వినియోగించేవారని రిపోర్టులు వచ్చినప్పటికీ, నేడు సినీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్, ఐటీ పరిశ్రమల నుంచీ వాడుతున్నట్టు తెలిసింది. తాజాగా, కన్నడ నటి రాగిణి ద్వివేదిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.