ఆ డ్రమ్‌లో రూ. 200 కోట్ల డ్రగ్స్ ఎక్కడివి?

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీరంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. సముద్ర తీరాన ఓ డ్రమ్‌లో చైనా భాషలో రాసి ఉన్న కవర్లను గమనించిన స్థానికులు.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవర్లను పరిశీలించి డ్రగ్స్ అని గుర్తించారు. ప్యాకెట్లలో ఉన్న పొడి మెథా బయోటిన్‌ డ్రగ్‌ అని తమిళనాడు నార్కోటిక్‌ విభాగం స్పష్టం చేసింది. వీటి విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. […]

Update: 2020-06-21 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీరంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. సముద్ర తీరాన ఓ డ్రమ్‌లో చైనా భాషలో రాసి ఉన్న కవర్లను గమనించిన స్థానికులు.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవర్లను పరిశీలించి డ్రగ్స్ అని గుర్తించారు. ప్యాకెట్లలో ఉన్న పొడి మెథా బయోటిన్‌ డ్రగ్‌ అని తమిళనాడు నార్కోటిక్‌ విభాగం స్పష్టం చేసింది. వీటి విలువ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

డ్రగ్‌ డీలర్లు చైనా నుంచి వీటిని షిప్పుల్లో తెచ్చే సమయంలో.. ఎవరికీ కనిపించకుండా డ్రమ్ములకి తాళ్లు కట్టి నీటిలోకి వదిలేస్తారని.. ఈ క్రమంలోనే తాళ్లు తెగి డ్రమ్ములు నీటిలో పడిపోయుంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. మహాబలిపురానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుండడంతో ఈ ప్రాంతంలో యథేచ్ఛగా డ్రగ్స్‌‌ను విక్రయిస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా డ్రమ్ము ఎలా వచ్చిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News