ఎక్కిళ్లను ఆపే స్ట్రా

దిశ, ఫీచర్స్ :ఎక్కిళ్లు దాదాపుగా అందరికీ సాధారణంగా వచ్చే సమస్యే. ఛాతీని, కడుపును వేరు చేసే డయాఫ్రం పొర హఠాత్తుగా సంకోచిస్తుంది. దీంతో స్వరపేటిక కొద్దిసేపు మూసుకుపోయి ఒక రకమైన శబ్ధం రావడమే ఎక్కిళ్లు. అయితే డయాఫ్రం పొరకు నాడీ సంకేతాలు అందకపోవటం వల్లే ఇలా జరుగుతుంది. చాలావరకు ఎక్కిళ్లు కొద్దిసేపటికి వాటంతటవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోతే.. షాక్‌కి గురిచేసేలా ఏదో ఒక వార్త చెప్పడం కానీ, సడెన్‌గా భయపెట్టించడం గానీ చేస్తుంటారు. దాంతో పాటు వేగంగా […]

Update: 2021-06-20 02:26 GMT

దిశ, ఫీచర్స్ :ఎక్కిళ్లు దాదాపుగా అందరికీ సాధారణంగా వచ్చే సమస్యే. ఛాతీని, కడుపును వేరు చేసే డయాఫ్రం పొర హఠాత్తుగా సంకోచిస్తుంది. దీంతో స్వరపేటిక కొద్దిసేపు మూసుకుపోయి ఒక రకమైన శబ్ధం రావడమే ఎక్కిళ్లు. అయితే డయాఫ్రం పొరకు నాడీ సంకేతాలు అందకపోవటం వల్లే ఇలా జరుగుతుంది. చాలావరకు ఎక్కిళ్లు కొద్దిసేపటికి వాటంతటవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోతే.. షాక్‌కి గురిచేసేలా ఏదో ఒక వార్త చెప్పడం కానీ, సడెన్‌గా భయపెట్టించడం గానీ చేస్తుంటారు. దాంతో పాటు వేగంగా నీళ్లు గుటక వేయటం, గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించటం, నిమ్మకాయ చప్పరించటం, అల్లం నమిలి రసాన్ని మింగడం, కాసేపు శ్వాస బిగపట్టటం వంటి రకరకాల శాస్త్రీయ ఆధారాలు లేని చిట్కాలు పాటిస్తారు. అయితే ఎక్కిళ్లను తగ్గించడానికి చక్కని పరిష్కారంగా ఎల్ షేప్ స్ట్రాను తయారుచేశారు శాస్త్రవేత్తలు.

మనిషికి ఎక్కిళ్ల అవస్తను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ‘ద ఫోర్స్‌డ్ ఇన్‌స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్(ఎఫ్ఐఎస్ఎస్‌టీ)’ అనే సాధనాన్ని తయారు చేశారు. దీంతో నీటిని సిప్ చేస్తే దాదాపు 92శాతం ఎక్కిళ్లను నివారిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. ఎల్ షేప్‌లో స్ట్రా మాదిరిగా ఉండే ఈ పరికరాన్ని ఓ వైపు మౌత్ పీస్, మరో ఎండ్‌లో ప్రెషర్ వాల్వ్‌తో రూపొందించారు. ఇక ఈ స్ట్రా ను పరిశీలించడానికి 249 వలంటీర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంది పరిశోధకుల బృందం. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో మూడింట రెండొంతుల మందికి కనీసం నెలకు ఒకసారి ఎక్కిళ్ళు వస్తాయని చెప్పగా.. 90% మంది ఇతర చిట్కాల కంటే ఇది చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు చెప్పారని జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌ తాజాగా ఫలితాలు వెల్లడించింది.

ఈ పరికరం ద్వారా నీటిని పీల్చుకోవడానికి ఫ్రేనిక్ నరాలు డయాఫ్రమ్‌ను సంకోచించేలా ప్రేరేపిస్తాయి. ఈ క్రమంలో నీటిని మింగడానికి వాగస్ నాడి యాక్టివేట్ అవుతుంది. కాగా ఎక్కిళ్లకు కారణమైన ఫ్రేనిక్, వాగస్ నరాలను బిజీగా ఉంచడం వల్ల ఎక్కిళ్లు ఆగిపోతాయి. ‘ఈ స్ర్టా తక్షణమే పనిచేసి ఎక్కిళ్ల నుంచి రిలీఫ్ అందించడమే కాకుండా కొన్ని గంటలపాటు ప్రభావాన్ని చూపుతుంది’ అని శాన్ ఆంటోనియోలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్, రచయిత డాక్టర్ అలీ సీఫీ చెప్పారు.

Tags:    

Similar News