గిలియడ్ సైన్సెస్‌తో డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యం!

ముంబయి: దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్‌తో ఒప్పందం చేసుకుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ తయారుచేయడం, మార్కెటింగ్ అంశాల్లో భాగస్వామ్య ఒప్పందం కుదరింది. శనివారం డా.రెడ్డీస్‌తో గిలియడ్‌ లైసెన్సింగ్ ఒప్పందంపై ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఇండియాతోపాటు 127 దేశాల్లో రెమ్‌డెసివిర్ రిజిస్ట్రేషన్, తయారీ, మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాల్లో […]

Update: 2020-06-13 07:50 GMT

ముంబయి: దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్‌తో ఒప్పందం చేసుకుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ తయారుచేయడం, మార్కెటింగ్ అంశాల్లో భాగస్వామ్య ఒప్పందం కుదరింది. శనివారం డా.రెడ్డీస్‌తో గిలియడ్‌ లైసెన్సింగ్ ఒప్పందంపై ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఇండియాతోపాటు 127 దేశాల్లో రెమ్‌డెసివిర్ రిజిస్ట్రేషన్, తయారీ, మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాల్లో డాక్టర్ రెడ్డీస్‌కు గిలియడ్ సైన్సెస్ సాంకేతింగా అవసరమైన సహకారాన్ని అందించనుంది. అమెరికా, ఇండియాలతోపాటు మరిన్ని దేశాల్లో కొవిడ్-19 చికిత్సలో ఔషధంగా భావిస్తున్న రెమ్‌డెసివిర్ అత్యవసర వినియోగ అధికారాన్ని పొందిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గిలియడ్ సైన్సెస్ పేర్కొంది. అలాగే, దేశీయంగా జుబిలెంట్ లైఫ్, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్, మైలాన్ కంపెనీల్లో గిలియడ్ కంపెనీ ఇప్పటికే భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 127 దేశాల్లో రెమ్‌డెసివిర్ తయారుచేసి పంపిణీ చేసేందుకు కంపెనీలకు అనుమతి ఉంటుంది. అంతేకాకుండా ఉత్పత్తిని పెంచి సొంతంగా ధరలను నిర్ణయించే వీలు ఉంటుంది.

Tags:    

Similar News