2021-22లో జీడీపీ రెండంకెల వృద్ధి

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడం, పెట్టుబడిదారుల సెంటిమెంట్ పుంజుకోవడంతో జీడీపీ వృద్ధి రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని ఓ నివేదిక తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 11 శాతానికి పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో వరుస ప్రతికూల వృద్ధి తర్వాత డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం సానుకూలంగా నమోదైంది. గతేడాది […]

Update: 2021-03-11 09:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడం, పెట్టుబడిదారుల సెంటిమెంట్ పుంజుకోవడంతో జీడీపీ వృద్ధి రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని ఓ నివేదిక తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 11 శాతానికి పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో వరుస ప్రతికూల వృద్ధి తర్వాత డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం సానుకూలంగా నమోదైంది. గతేడాది నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే సాధ్యమైందని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు సంజయ్ అగర్వాల్ అన్నారు. గత పదకొండు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన విస్తృత విధానాల చర్యల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News