గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ ట్రయల్స్!

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇటీవల టెలికాం డిపార్ట్‌మెంట్ విభాగం(డీఓటీ) టెలికాం కంపెనీలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం 5జీ టెక్నాలజీ పరీక్షించేందుకు టెలికాం కంపెనీలను టెలికాం విభాగం కోరనున్నట్టు తెలుస్తోంది. దేశీయంగా 5జీ ట్రయల్స్ కోసం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాకు 6 నెలలపాటు ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. వీటితో పాటు ప్రభుత్వ యాజమాన్య టెలికాం సంస్థ ఎంటీఎన్ఎల్ సైతం […]

Update: 2021-05-30 09:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇటీవల టెలికాం డిపార్ట్‌మెంట్ విభాగం(డీఓటీ) టెలికాం కంపెనీలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం 5జీ టెక్నాలజీ పరీక్షించేందుకు టెలికాం కంపెనీలను టెలికాం విభాగం కోరనున్నట్టు తెలుస్తోంది. దేశీయంగా 5జీ ట్రయల్స్ కోసం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాకు 6 నెలలపాటు ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. వీటితో పాటు ప్రభుత్వ యాజమాన్య టెలికాం సంస్థ ఎంటీఎన్ఎల్ సైతం ట్రయల్స్ కోసం అవసరమైన రూ. 5 వేల ఫీజును చెల్లించిన తర్వాత 5జీ టెక్నాలజీ పరీక్షలకు అనుమతి అందుకోనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 5జీ ట్రయల్స్ కోసం ఎంటీఎన్ఎల్ సీ-డాట్‌తో భాగస్వామ్యం కానుంది.

టెలికాం కంపెనీలకు ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సీ-డాట్‌లతో 5జీ ట్రయల్స్‌కు ఆమోదం లభించింది. రిలయన్స్ సంస్థ తన సొంత టెక్నాలజీతో ట్రయల్స్ నిర్వహించనుంది. చైనాకు చెందిన కంపెనీలతో ఎలాంటి భాగస్వామ్యం ఉండకూడదని డీఓటీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రయల్స్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సహా పలుచోట్ల నిర్వహించనున్నారు. టెలికాం కంపెనీలకు 700 మెగాహెర్ట్జ్, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రంను డీఓటీ కేటాయించింది.

Tags:    

Similar News