లాక్‌డౌన్‌లో ఇవి బంద్.. వీటికి అనుమతి!

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ లాక్‌డౌన్ కాలంలో పాటించాల్సిన నిబంధనలను విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కఠినంగా అమలవుతుంది. తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని నిబంధనలు పాక్షికంగా సడలించింది. అయితే, ఇప్పుడు బంద్ ఉండేవి.. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత అమల్లోకి రాబోయే మినహాయింపులేమిటో ఓ సారి చూద్దాం.. ఇవి బంద్ ఉంటాయి -దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, మెట్రో ట్రైన్‌లు, బస్సులు బంద్ -జిల్లాలు, […]

Update: 2020-04-15 03:08 GMT

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ లాక్‌డౌన్ కాలంలో పాటించాల్సిన నిబంధనలను విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కఠినంగా అమలవుతుంది. తర్వాత కరోనా హాట్‌స్పాట్‌లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని నిబంధనలు పాక్షికంగా సడలించింది. అయితే, ఇప్పుడు బంద్ ఉండేవి.. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత అమల్లోకి రాబోయే మినహాయింపులేమిటో ఓ సారి చూద్దాం..

ఇవి బంద్ ఉంటాయి

-దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, మెట్రో ట్రైన్‌లు, బస్సులు బంద్
-జిల్లాలు, రాష్ట్రాల మధ్య రాకపోకలు నిషేధం
-అన్ని విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్
-ట్యాక్సీలు(ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు సహా), క్యాబ్‌ల సేవలు రద్దు
-సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్నాషియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్
పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్, థియేటర్‌లు, బార్‌లు, ఆడిటోరియం బంద్
-అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల్లో 20 మందికన్నా ఎక్కువ గుమిగూడొద్దు
-అన్ని సామాజిక, రాజకీయ, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అకడమిక్, సాంస్కృతిక, మత, ఇతర
వేడుకలూ నిషేధం
-అన్ని మతాల ప్రార్థన స్థలాల మూసివేత

20వ తేదీ తర్వాత వీటికి అనుమతులు :

-వైద్యారోగ్య సేవలు, ఔషధాలు, రక్షణ పరికరాల ఉత్పత్తి యూనిట్లు
-వ్యవసాయ పనులు, ధాన్యం కొనుగోళ్లు, మార్కెటింగ్, సాగుకు సంబంధించిన షాపులు, ఫిషింగ్
కార్యకలాపాలు
-టీ, కాపీ, రబ్బర్ పనులు(50శాతం మంది కార్మికులతో), ప్రాసెసింగ్, మార్కెటింగ్ కూడా..
-బ్యాంకింగ్ సేవలు, ఐఆర్‌డీఐ, ఇన్సూరెన్స్ కంపెనీలు
-అంగన్‌వాడీ కార్యకర్తలు 15 రోజులకు ఓసారి పౌష్టికాహార, ఫుడ్ ఐటమ్స్‌ను లబ్దిదారుల ఇంటివద్దకే
చేరవేస్తాయి. లబ్దిదారులు అంగన్‌వాడీలకు వెళ్లరాదు.
-అన్ని విద్యాసంస్థలు బంద్ ఉంటాయి కానీ, ఆన్‌లైన్ విద్యకు అనుమతి
-సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేయొచ్చు
-పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ సంబంధిత సేవలు
-రోడ్డు, సముద్ర మార్గం, విమాన కార్గో సేవలు
-ట్రక్కులు, హైవే దాబాలు, ట్రక్కుల రిపేర్ సెంటర్లు
-నిత్యావసరాలకు సంబంధించిన అన్ని విభాగాలు.. దుకాణాలు, రవాణా, ఈ కామర్స్ సేవలు. పౌల్ట్రీ,
చేపలు, మాంసం, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించిన షాపులు
-ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సేవలు
-ఐటీ, ఐటీ సేవలు (50శాతం కార్మిక సిబ్బందితో)
-ఈ కామర్స్ సంస్థలు, వాటి వాహనాలు, కొరియర్ సేవలు
-టూరిస్టులు, లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వ్యక్తులు, మెడికల్ సిబ్బందికి ఆశ్రయం ఇచ్చే
లాడ్జీలు, హోటల్స్, మోటల్స్, హోం స్టేలు
-గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇటుక బట్టీలు, సెజ్‌లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, టౌన్‌షిప్పుల్లో
పరిశ్రమలకు అనుమతి ఉంటుంది. కానీ, కార్మికుల నివాసం, రవాణాకు యాజమాన్యాలే బాధ్యత
తీసుకోవాలి.
-మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల బయట.. రూరల్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం, ఇరిగేషన్
ప్రాజెక్టు, భవన నిర్మాణం సహా అన్ని రకాల పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతి
-ఎమర్జెన్సీ సర్వీసులు, నిత్యావసర సరుకులకు సంబంధించిన సేవలు చేస్తున్న వ్యక్తుల(ఫోర్ వీలర్
అయితే… డ్రైవర్‌తోపాటు ఒకరికి, టూ వీలర్ అయితే ఒక్కరికే అనుమతి)కు బయటికి వెళ్లేందుకు
అనుమతి.
-పని ప్రదేశాలకు వెళుతున్న వారికి అనుమతి
-పని ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
-బహిరంగ ప్రదేశాల్లో ఏ కార్యక్రమమైనా ఐదుగురికి మించి ఒక చోట చేరొద్దు.
-వివాహాలు, అంత్యక్రియలకు మంది హాజరుపై జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి
-మద్యం, గుట్కా, తంబాకుల అమ్మకాలపై, బహిరంగ ఉమ్మివేత నిషేధం.

*అయితే, కంటైన్‌మెంట్ జోన్‌లలో ఈ అనుమతులేవీ ఉండవు

Tags: must, not, do’s, dont’s, lockdown, guidelines, india, ministry of home
affairs,MHA

Tags:    

Similar News