పేజీలు తిప్పడానికి ఉమ్మి వాడకండి
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ప్రాంత చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అభిషేక్ గోయల్ ఒక కొత్త సర్క్యులర్ జారీ చేశారు. తమ దగ్గర పనిచేసే అధికారులు, ఉద్యోగులను పేజీలు తిప్పడానికి నాలుక మీద చేయి పెట్టి ఉమ్మి ఉపయోగించవద్దని ఆ సర్క్యులర్ సారాంశం. ఉమ్మికి బదులుగా వాటర్ డస్టర్‌ను ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి విధానం అలవాటు చేసుకోవడం వల్ల ఉమ్మి ద్వారా, చేతి స్పర్శ ద్వారా వ్యాపించే వ్యాధులను ఎంతో కొంత అరికట్టవచ్చని ఆయన […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ప్రాంత చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అభిషేక్ గోయల్ ఒక కొత్త సర్క్యులర్ జారీ చేశారు. తమ దగ్గర పనిచేసే అధికారులు, ఉద్యోగులను పేజీలు తిప్పడానికి నాలుక మీద చేయి పెట్టి ఉమ్మి ఉపయోగించవద్దని ఆ సర్క్యులర్ సారాంశం. ఉమ్మికి బదులుగా వాటర్ డస్టర్‌ను ఉపయోగించాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి విధానం అలవాటు చేసుకోవడం వల్ల ఉమ్మి ద్వారా, చేతి స్పర్శ ద్వారా వ్యాపించే వ్యాధులను ఎంతో కొంత అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ఈ అలవాటును కచ్చితంగా పెంపొందింపచేయాలని సర్క్యులర్‌లో ఆదేశించారు.
Read also..