పార్కు….నాట్ ఫర్ పార్కింగ్…
దిశ, వెబ్ డెస్క్: పార్కులను పార్కులుగానే చూడాలని..వాటిని పార్కింగ్ స్థలాలుగా మార్చకూడదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. సుల్తాన్ పురి పార్కు ఆక్రమణపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. వాహనాల పార్కింగ్ కోసం పార్కులను వాడరదని కోర్టు చెప్పింది. సుల్తాన్ పురి పార్కులోని దురాక్రమణలను తొలగించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. దిల్షాద్ సిద్ధిఖీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ […]
దిశ, వెబ్ డెస్క్:
పార్కులను పార్కులుగానే చూడాలని..వాటిని పార్కింగ్ స్థలాలుగా మార్చకూడదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. సుల్తాన్ పురి పార్కు ఆక్రమణపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. వాహనాల పార్కింగ్ కోసం పార్కులను వాడరదని కోర్టు చెప్పింది. సుల్తాన్ పురి పార్కులోని దురాక్రమణలను తొలగించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. దిల్షాద్ సిద్ధిఖీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. పార్కులనేవి వినోదం కోసం ఉద్దేశించినవనీ…వాహనాల పార్కింగ్ కోసం వాటిని ఉపయోగించ కూడదని ధర్మాసనం పేర్కొంది. పార్కులను పార్కింగ్ కు వాడకుండా అధికారులు చర్యలను తీసుకోవాలని కోర్టు తెలిపింది. దీనిని అమలు చేయడంలో అధికారులు విఫలమైతే వారిపై చర్యలను తీసుకుంటామని కోర్టు తెలిపింది.