ఫస్ట్ టైం మాస్క్‌తో ట్రంప్..

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తొలిసారిగా మాస్క్ ధరించి కనిపించారు. అమెరికా అధ్యక్షుడి సీల్ ఉన్న నల్లని రంగు మాస్క్‌ను ధరించి ఆయన వాషింగ్టన్‌లోని ఓ మిలిటరీ హాస్పిటల్ బయట మీడియాకు దర్శనమిచ్చారు. సొంత ప్రభుత్వమే మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించినప్పటికీ వాటిని ధరించడంపై డొనాల్డ్ ట్రంప్ ఆది నుంచీ విముఖత చూపిస్తూ వస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అధ్యక్షుడే మాస్క్ ధరించకపోవడంపై ఆయన అంతరంగికుల్లోనూ అసంతృప్తి ఉన్నది. అమెరికాలో ప్రతిరోజూ సుమారుగా […]

Update: 2020-07-12 05:21 GMT

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తొలిసారిగా మాస్క్ ధరించి కనిపించారు. అమెరికా అధ్యక్షుడి సీల్ ఉన్న నల్లని రంగు మాస్క్‌ను ధరించి ఆయన వాషింగ్టన్‌లోని ఓ మిలిటరీ హాస్పిటల్ బయట మీడియాకు దర్శనమిచ్చారు. సొంత ప్రభుత్వమే మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించినప్పటికీ వాటిని ధరించడంపై డొనాల్డ్ ట్రంప్ ఆది నుంచీ విముఖత చూపిస్తూ వస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అధ్యక్షుడే మాస్క్ ధరించకపోవడంపై ఆయన అంతరంగికుల్లోనూ అసంతృప్తి ఉన్నది. అమెరికాలో ప్రతిరోజూ సుమారుగా 60వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక్కసారైనా మాస్క్ ధరించి మీడియాకు కనబడాలని వారు ప్రత్యేకంగా ట్రంప్‌ను అభ్యర్థించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మాస్కు ధరించాలని మనసు మార్చుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు మాస్కు ధారణకు తాను ఎప్పుడూ వ్యతిరేకిని కాదని, స్థల కాలాలను బట్టి ధరించడం అవసరమేనని ట్రంప్ సెలవిచ్చారు. ఇప్పటికీ ట్రంప్‌ను సమర్థిస్తున్న కన్జర్వేటివ్‌లు మాస్కులు ధరించడాన్ని నిరసిస్తున్నారు. మాస్కులు ధరించాలన్న ప్రకటనలు తమ వ్యక్తిగత హక్కును హరిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రగతిశీల శిబిరాలు ప్రస్తుత ఆపత్కాలంలో మాస్కులు ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంటున్నాయి. ఈ నేతలు మాస్కులు ధరిస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ డొనాల్డ్ ట్రంప్ మాస్కులు ధరించడం లేదు. అంతేకాదు, ప్రత్యర్థి నేత జో బిడెన్ మాస్కు ధరించి ప్రచారం చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసి పరిహసించారు కూడా. మాస్కులు ధరిస్తే తాను బలహీనుడిగా కనిపిస్తానని ట్రంప్ అతని ఆంతరంగికులకు చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News