మితిమీరుతున్న ఆధిపత్య వర్గ పోరు.. చోద్యం చూస్తున్న నాయకులు?

దిశ, తొర్రూరు : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తొర్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో తొర్రూరు ఒకటి. ఈ నియోజకవర్గ ఇన్ చార్జిగా  జంగారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు అనుకూలంగా మండల కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. తొర్రూరు మండల […]

Update: 2021-10-02 03:55 GMT

దిశ, తొర్రూరు : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తొర్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో తొర్రూరు ఒకటి. ఈ నియోజకవర్గ ఇన్ చార్జిగా జంగారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు అనుకూలంగా మండల కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. తొర్రూరు మండల అధ్యక్షులుగా ఎన్నుకున్న వ్యక్తి.. గత మూడేళ్ల క్రితం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరడం, ఎమ్మెల్యే ఎన్నికల తరువాత ఆ ఇన్ చార్జి.. కొంత తొర్రూరు మండలాన్ని పట్టించుకోకపోవడంతో అప్పుడు ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చొరవ తీసుకొని ఖాళీగా ఉన్న మండల అధ్యక్ష పదవిని భర్తీ చేశారు.

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో వచ్చిన జోష్ తో నియోజకవర్గ ఇన్ చార్జి అన్ని మండలాల్లో కమిటీలను వేస్తూ తొర్రూరు మండల కమిటీని కూడా జిల్లా అధ్యక్షులుతో ప్రకటించుకోవడం జరిగింది. ప్రస్తుత కమిటీని కొనసాగించాలని జిల్లా అధ్యక్షునికి నివేదిక చేసుకోవడంతో మీకే నా సపోర్ట్ అని భరోసా ఇచ్చారని చెప్పుకోవడం విశేషం. దీంతో మండలంలో పాత కమిటీ చెల్లదని, లేదులేదు కొత్త కమిటీ చెల్లదంటూ సోషల్ మీడియా వేదికగా, పత్రికా ముఖంగా ప్రకటనలు చేస్తుండడం జరుగుతుంది. గత కొద్దిరోజులుగా పోటాపోటీగా కార్యక్రమాలు చేయడం, జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం ఇన్ చార్జి చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు డైలమాలో పడుతున్నారు. ఈ రెండు వర్గాలు రేవంత్ రెడ్డి సీఎం కావడమే లక్ష్యమని, పార్టీ ప్రకటించే ఇన్ చార్జిని గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని చెప్పుకోవడం కొసమెరుపు. ఈ విషయంలో జిల్లా, నియోజకవర్గ ఇన్ చార్జిలు త్వరితగతిన స్పందించి ఎవరిది అసలైన కమిటీ, ఎవరిది కాదు అనేది తేల్చి చెప్పకపోతే, పార్టీ శ్రేణుల్లో ఉండే అపోహలతో పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News