సమంత- చైతన్య విడాకులు.. అతనికి మొదలైన టార్చర్
దిశ, వెబ్డెస్క్: అక్కినేని వారసుడు చైతన్య- సమంత విడాకుల విషయంలో సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ కానీ, విడాకులు తీసుకున్న జంట కానీ నోరు మెదపకపోయినా వారి సన్నిహితుల నుంచి తెలుస్తున్న నిజాలు షాక్ కి గురిచేస్తున్నాయి. సామ్- చై విడాకులకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని, అందులో ముఖ్యంగా సామ్- చైతూ విడిపోవడానికి ప్రధాన కారణం సామ్ పర్సనల్ డిజైనర్ అయిన ప్రీతమ్ జుకల్కర్ అని సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నాయి. అసలు […]
దిశ, వెబ్డెస్క్: అక్కినేని వారసుడు చైతన్య- సమంత విడాకుల విషయంలో సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ కానీ, విడాకులు తీసుకున్న జంట కానీ నోరు మెదపకపోయినా వారి సన్నిహితుల నుంచి తెలుస్తున్న నిజాలు షాక్ కి గురిచేస్తున్నాయి. సామ్- చై విడాకులకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని, అందులో ముఖ్యంగా సామ్- చైతూ విడిపోవడానికి ప్రధాన కారణం సామ్ పర్సనల్ డిజైనర్ అయిన ప్రీతమ్ జుకల్కర్ అని సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నాయి. అసలు వీరిద్దరి జీవితాల్లోకి అతడు ఎందుకు వచ్చాడు..? ఎందుకు అందరికి అతనిపై అనుమానం వచ్చింది..? అంటే.. గత కొంతకాలంగా సామ్- చైతూ విడాకుల విషయంలో అతను పెట్టిన పోస్టులు అనుమానించతగ్గ రీతిలోనే ఉన్నాయి.
చైతన్య – సమంత జంట విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ప్రీతమ్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు షేర్ చేస్తున్నాడు. పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ అతని పోస్టులు చూస్తుంటే ఎవరికో ఏదో అన్యాయం జరిగింది అనే విషయాన్ని చెప్పాలని చూస్తున్నట్లు ఉంటున్నాయి. ఇక ఇన్స్టాగ్రామ్లో ప్రీతమ్ జుకల్కర్ తొలగించిన ఓ పోస్టు చై-సామ్ విడాకులకు అసలు కారణాన్ని వెల్లడించాడా? అని అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. సమంత మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే విడాకులకు దారి తీసిందా అనే అనుమానాలు తలెత్తెలా అతని డిలీటెడ్ పోస్ట్ ఉంది. అంతేకాకుండా ఇంకో పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ”ఎవరైతే వారి ఇళ్లలో మగవాళ్ల నిజస్వరూపాన్ని దాచిపెడతారో.. వారే మహిళలపై జరిగే హింసకు బాధ్యులు అవుతారు” అని ఓ పోస్టులో ”అందులోనూ పేరు ప్రఖ్యాతలున్న కుటుంబాలు దీనికి మరింత కారణం అవుతాయి. ఈ రోజుల్లో వైలెన్స్ అనేది మానసిక వేధింపులు/ట్రోల్స్ రూపంలో ఉంటోంది” అని మరో కోట్ పోస్ట్ చేసాడు. అయితే వీటిని కొంత సేపటికే అతను తొలగించాడు.
ఇకపోతే వీరిద్దరి విడాకులకు ప్రీతమే కారణమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. సమంత పర్సనల్ డిజైనర్ అయిన ప్రీతమ్ జుకల్కర్ సమంతతో కలిసి దిగిన ఫోటోలు గతంలో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. బోల్డ్ ఫోటోషూట్లు, అతడితో బోల్డ్ ఫొటోస్ దిగిన సామ్ వాటికి లవ్ సింబల్ పెట్టి మరి పోస్ట్ చేయడం సామ్ అభిమానులకు మింగుడు పడలేదు. వీరిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా..? దాని వలనే చై విడాకులకు ఒప్పుకున్నాడా..? అనే అనుమానాలు తలెత్తాయి. దీంతో వారిద్దరి విడాకులకు ఇతనే కారణమని ఆగ్రహంతో అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రీతమ్ వాటిని సైబర్ క్రైం పోలీసుకు ట్యాగ్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు నెట్టింట వైరల్ గా మారాయి.