‘కేటీఆర్‌కు రేపిస్టులే కావాలా..’ నెటిజన్ల ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది మంత్రి కేటీఆర్ పేరు. కేబినేట్లో ముఖ్యమైన మంత్రిగా ఉంటూ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా చాలా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. అయితే, తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎంతమంది ట్వీట్లు చేస్తుంటారో.. దానికి పది రెట్లు ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చారంటూ విమర్శిస్తూ ట్వీట్ చేస్తుంటారు. నిన్న నిరుద్యోగి ఆత్మహత్య పై మండిపడిన నెటిజన్లు తాజాగా, మాజీ […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది మంత్రి కేటీఆర్ పేరు. కేబినేట్లో ముఖ్యమైన మంత్రిగా ఉంటూ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా చాలా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. అయితే, తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎంతమంది ట్వీట్లు చేస్తుంటారో.. దానికి పది రెట్లు ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చారంటూ విమర్శిస్తూ ట్వీట్ చేస్తుంటారు. నిన్న నిరుద్యోగి ఆత్మహత్య పై మండిపడిన నెటిజన్లు తాజాగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చేసిన ట్వీట్ పై తెగ చర్చిస్తున్నారు.
కొండా చేసిన ట్వీట్ ‘‘ News BOMBSHELL very successfully withheld. 6 yrs old CHILD Siri rape &murder. CMs son Rama Rao’s associate Shankar mandal TRS leader believed the criminal. He is in police protection/custody. Most press silent. If it came out on 29th, TRS would have got ZERO votes in Huzurabad’’ అని ఉంది.
‘సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన టీఆర్ఎస్ లీడర్ ఆరేళ్ల చిన్నారిని దారుణంగా రేప్ చేశారు. అతన్ని పోలీసు కస్టడీలో ఉంచి రక్షణ కల్పించారు. కొన్ని మీడియా చానళ్లు మాత్రమే వీటిని ప్రచారం చేశాయి. ఈ ఘటన అక్టోబర్ 29న జరిగిందని, ఈ విషయాన్ని మీడియా విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి సున్న ఓట్లు వచ్చేవి.’ అని ట్వీట్ సారాంశం. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ‘‘వీళ్లకి (రేపిస్టులు)అలాంటి వాళ్లే కావాలి సర్’’ అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
వీళ్ళకి అలాంటివాళ్ళు ఏ కావాలి సర్ pic.twitter.com/1Mfh4d9jor
— men will be men…. (@unemployrammy) November 1, 2021