కరోనా లక్షణాలు.. గాంధీకి తరలింపు
దిశ, మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారి జిల్లాను తాకిందనే వదంతులు మొదలుకావడంతో ఒక్కసారిగా జిల్లా ఉలికిపడింది. ఇంతవరకు జిల్లాలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని క్వారెంటైన్‌కు తరలించిన నేపథ్యంలో తాజాగా జిల్లా వాసిని కరోనా లక్షణాలు వున్నాయని గాంధీ అసుపత్రికి తరలించారు. వివరాళ్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలోని కావేరమ్మపేట ప్రాంతంలో నివాసం వుంటున్న ఓ వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాడు. డిప్యూటేషన్‌పై అతన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన […]
దిశ, మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారి జిల్లాను తాకిందనే వదంతులు మొదలుకావడంతో ఒక్కసారిగా జిల్లా ఉలికిపడింది. ఇంతవరకు జిల్లాలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని క్వారెంటైన్‌కు తరలించిన నేపథ్యంలో తాజాగా జిల్లా వాసిని కరోనా లక్షణాలు వున్నాయని గాంధీ అసుపత్రికి తరలించారు. వివరాళ్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలోని కావేరమ్మపేట ప్రాంతంలో నివాసం వుంటున్న ఓ వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాడు. డిప్యూటేషన్‌పై అతన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో విధుల నిర్వాహణకు ఉంచారు. వారం రోజులుగా అతను రోజు జడ్చర్లకు వచ్చి వెళుతున్నాడు. అయితే గత రెండ్రోజులుగా అతను జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించడంతో వాళ్లు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా కుటుంబసభ్యులను కూడా క్వారెంటైన్ సెంటర్లకు తరలించారు. అయితే ఈ విషయాని ఇంకా అధికారులు మాత్రం ద్రువీకరించడం లేదు. కాని ఈ వార్త ప్రస్తుతం వివిధ పత్రికలతో పాటు వార్తా ఛానళ్ళలో రావడంతో వైరల్ అయ్యింది. అసలు అతనికి కోవిడ్ -19 వచ్చిందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. కాని ఈ వార్త తెలిసిన వెంటనే జడ్చర్ల పట్టణవాసులతో పాటు జిల్లా వాసులు కూడా అప్రమత్తం అయ్యారు. నిన్నటి వరకు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు అనే ధీమాతో వున్న వారు సైతం ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నారు.
Tags: Doctors, rushed, Gandhi hospital, person, coronavirus symptoms, jadcherla