ఏం డాక్టర్ రా బాబు.. ఒక్కడే.. 7 గంటల్లో 101 మంది మహిళలకు..

దిశ, వెబ్‌డెస్క్: అప్పుడప్పుడు తప్పులు అందరు చేస్తుంటారు.. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేస్తుంటారు. కొన్నిసార్లు అవి లైట్ గా కనిపించినా.. మరికొందరికి అవే సీరియస్ గా మారతాయి. తాజాగా ఒక డాక్టర్ అత్యుత్సాహం అతనిని వివాదంలోకి నెట్టింది. చివరికి షోకాజ్ నోటీసులు అందుకునేలా చేసింది. ఇంతకీ ఆ డాక్టర్ చేసిన తప్పు ఏంటి..? ఏ రూల్ బ్రేక్ చేశాడు..? అంటే.. పూర్తి స్టోరీ చదవాల్సిందే.. వివరాలలోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ప్రభుత్వ వైద్యుడు డా.జిబ్నస్ […]

Update: 2021-09-05 00:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: అప్పుడప్పుడు తప్పులు అందరు చేస్తుంటారు.. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేస్తుంటారు. కొన్నిసార్లు అవి లైట్ గా కనిపించినా.. మరికొందరికి అవే సీరియస్ గా మారతాయి. తాజాగా ఒక డాక్టర్ అత్యుత్సాహం అతనిని వివాదంలోకి నెట్టింది. చివరికి షోకాజ్ నోటీసులు అందుకునేలా చేసింది. ఇంతకీ ఆ డాక్టర్ చేసిన తప్పు ఏంటి..? ఏ రూల్ బ్రేక్ చేశాడు..? అంటే.. పూర్తి స్టోరీ చదవాల్సిందే..

వివరాలలోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ప్రభుత్వ వైద్యుడు డా.జిబ్నస్ ఎక్కా హస్తవాసి మంచిదని గుర్తింపు. ప్రభుత్వ డాక్టర్ అయిన ఆయన పలు చిన్న చిన్న గ్రామాల్లో ఎన్నో శస్త్రచకిత్స శిబిరాలను నిర్వహించి మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే మైన్ పట్ లో ఉన్న నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆగస్టు 27న ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్రచకిత్స శిబిరం నిర్వహించింది. ఈ క్యాంప్ కి ఆ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆపరేషన్ కోసం ఎంతోమంది మహిళలు లైన్ కట్టారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే వైద్యుడు 101 మహిళలకు ఆపరేషన్ లు చేశాడు.

ఒక రోజులో ఒక వైద్యుడు 30 ఆపరేషన్లు మాత్రమే చేయాలి.. ఇక్కడ మూడు రెట్లు చేయడంపై వివాదం చెలరేగింది. దీంతో వైద్యుడిపై జిల్లా వైద్యాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన డాక్టర్. జిబ్నస్ ఎక్కా మాట్లాడుతూ.. క్యాంపుకు ఎక్కడెక్కడి నుంచో మహిళలు వచ్చారని సూదూర ప్రాంతాల నుంచి వచ్చామని.. మళ్లీ రాలేమని కోరడంతో అలా ఆపరేషన్ చేశానని.. వారి ఒత్తిడి మేరకే చేశానని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా డాక్టర్ రూల్స్ బ్రేక్ చేయడంతో అతనికి కఠిన శిక్షనే అమలు చేయాలని అధికారులు అంటున్నారు.

Tags:    

Similar News