దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు : IMA
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల18వ తేదీన వైద్యులు ఆందోళనకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ‘సేవ్ ది సేవియర్’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఆరోజున నిరసనలకు దిగనున్నారు. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నల్లటి దుస్తులు, మాస్కులు, బ్యాడ్జీలను ధరించి నిరసనల్లో పాల్గొనాలని సూచించింది. అయితే, ఆరోజు ఆస్పత్రులు మాత్రం యథావిధిగా […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల18వ తేదీన వైద్యులు ఆందోళనకు పిలుపునిచ్చినట్లు తెలిపింది.
‘సేవ్ ది సేవియర్’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఆరోజున నిరసనలకు దిగనున్నారు. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నల్లటి దుస్తులు, మాస్కులు, బ్యాడ్జీలను ధరించి నిరసనల్లో పాల్గొనాలని సూచించింది. అయితే, ఆరోజు ఆస్పత్రులు మాత్రం యథావిధిగా నడుస్తాయని పేర్కొంది. ఇప్పటికైనా కేంద్రం దేశవ్యాప్తంగా వైద్యులు, సిబ్బందిపై జరుగుతున్న దాడుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని IMA కోరింది.