'రావిచెట్టుకు పూజ'లు ఎందుకు చేస్తారో తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్: ఆనాటి రోజుల్లో పెద్దవాళ్లు చెప్పేమాటలను.. వాళ్లు చేయమని చెప్పిన పనులను సంప్రదాయబద్ధంగా పాటించేవారు. ఎందుకంటే పదే పదే ఈ పని చేయండి అని చెబితే ఎవరూ చేయరు కాబట్టి అదొక సంప్రదాయబద్ధంగా పాటించమని చెబితే అది అందరూ శ్రద్ధగా పాటిస్తారు కాబట్టి అలా చెప్పేవారు… అలానే అందరూ పాటించేవారు. ఇలా చాలా విషయాలు మనకు ఇప్పటికీ సంప్రదాయ బద్ధంగా కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి రావి చెట్టుకు పూజలు చేయడం. అయితే, ఇన్ని […]
దిశ, వెబ్ డెస్క్: ఆనాటి రోజుల్లో పెద్దవాళ్లు చెప్పేమాటలను.. వాళ్లు చేయమని చెప్పిన పనులను సంప్రదాయబద్ధంగా పాటించేవారు. ఎందుకంటే పదే పదే ఈ పని చేయండి అని చెబితే ఎవరూ చేయరు కాబట్టి అదొక సంప్రదాయబద్ధంగా పాటించమని చెబితే అది అందరూ శ్రద్ధగా పాటిస్తారు కాబట్టి అలా చెప్పేవారు… అలానే అందరూ పాటించేవారు. ఇలా చాలా విషయాలు మనకు ఇప్పటికీ సంప్రదాయ బద్ధంగా కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి రావి చెట్టుకు పూజలు చేయడం.
అయితే, ఇన్ని చెట్లున్నా.. కేవలం రావి చెట్టుకు మాత్రమే మనం ఎందుకు పూజలు చేస్తాం? అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. అది ఒక సంప్రదాయం.. ఈ పూజా విధానం ఆనాటి నుంచి కొనసాగుతుంది.. మేం కూడా కొనిసాగిస్తున్నాం అని చెబుతుంటారు. ఇంకొందరు అలా చేస్తే మంచి జరుగుతది అని చెబుతుంటారు. కానీ, అందులో దాగి ఉన్న వాస్తవం మాత్రం చాలామందికి తెలియదు. అదేమిటంటే.. ఒక్క రావి చెట్టు తప్ప మిగతా చెట్లన్నీ రాత్రి వేళల్లో కార్భన్ డై యాక్సైడ్, మిగతా సమయంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. కానీ, రావి చెట్టు ఒక్కటే రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో రావి చెట్టును కాపాడలన్న ఉద్దేశంతో ఆనాటి పెద్దలు రావి చెట్టుకు పూజలు చేయాలి.. దానిని నరకొద్దు అనే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇదీ.. రావి చెట్టుకు పూజలు చేయడం వెనుక ఉన్న అసలు విషయం.