తలనొప్పి నేర్పిన యాసలు !
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు సినిమాలనే కాదు.. ఇతర భాషల సినిమాల్లోనూ.. తలపై దెబ్బ తగలగానే గతం మర్చిపోతుంటారు. ఆ తర్వాత మళ్లీ తలపై ఏదో తాకగానే మళ్లీ గతం గుర్తుకొస్తుంటుంది. ఇలాంటి సీన్లను చూసి సినిమాయే కదా అని మనం కూడా లైట్ తీసుకుంటాం. కానీ అలాంటి కోవలోకి వచ్చే వింత రకం సిండ్రోమ్ ఒకటుంది. అదే ‘ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్’. ఇదో స్పీచ్ డిజార్డర్. ఇంతకీ దీని గోలేంటి అంటారా? మనిషి చూడటానికి మామూలుగానే […]
దిశ, వెబ్‌డెస్క్ :
తెలుగు సినిమాలనే కాదు.. ఇతర భాషల సినిమాల్లోనూ.. తలపై దెబ్బ తగలగానే గతం మర్చిపోతుంటారు. ఆ తర్వాత మళ్లీ తలపై ఏదో తాకగానే మళ్లీ గతం గుర్తుకొస్తుంటుంది. ఇలాంటి సీన్లను చూసి సినిమాయే కదా అని మనం కూడా లైట్ తీసుకుంటాం. కానీ అలాంటి కోవలోకి వచ్చే వింత రకం సిండ్రోమ్ ఒకటుంది. అదే ‘ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్’. ఇదో స్పీచ్ డిజార్డర్. ఇంతకీ దీని గోలేంటి అంటారా?
మనిషి చూడటానికి మామూలుగానే ఉంటాడు. కానీ తరచుగా విపరీతమైన తలనొప్పి(మైగ్రేన్)తో బాధపడుతుంటారు. వీళ్లు తమకు తెలియకుండానే వాళ్ల స్పీచ్‌లో వేరే దేశాల యాక్సెంట్ మాట్లాడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు ఉన్నట్టుండి జపనీస్ నుంచి కొరియన్, బ్రిటీష్ ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్, అమెరికన్ ఇంగ్లీష్ నుంచి బ్రిటీష్ ఇంగ్లీష్, స్పానిష్ టూ హంగేరియన్ ఇలా ఫారిన్ యాక్సెంట్‌లో మాట్లాడుతుంటారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన, ట్రామాటిక్ బ్రెయిన్ సర్జరీ అయిన వారికి ఎఫ్ఏసీ (ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్) వస్తుంటుంది. ప్రస్తుతం యూకేకు చెందిన 31 ఏళ్ల ఎమిల్ ఎగన్ ఎఫ్ఏసీతోనే బాధపడుతోంది. ఆమె ప్రస్తుతం రష్యా, ఇటాలియన్, పాలిష్ , ఫ్రెంచ్ భాషలు మాట్లాడుతుండటం గమనార్హం.
ఎమిలీకి రెండు, మూడు వారాలుగా విపరీతమైన తలనొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్లింది. అప్పటికే ఆమె మాట కోల్పోయింది. కాగా పలు టెస్టులు చేసిన డాక్టర్లు.. ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఆమె మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు డాక్టర్లు ఆమెను వెకేషన్ వెళ్లమని సూచించారు. ఆ తర్వాత ఎమిలీకి క్రమంగా వాయిస్ వచ్చినా కానీ, అది తన వాయిస్‌లా అనిపించలేదు. యాక్సెంట్ కూడా చేంజ్ అవుతోంది. పైగా అప్పటివరకు ఆమె ఏ విదేశాలకు వెళ్లకున్నా.. ఇతర దేశాల యాక్సెంట్ మాట్లాడుతోంది. ఇలా రోజులు, నెలల తరబడే కాదు జీవితాంతమూ ఎమిలీ వేరే యాక్సెంట్‌లు మాట్లాడుతూ ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆమె ‘ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్’తో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు.
అమెరికాకు చెందిన మిచెల్లీ మైయెర్స్ కూడా ఇదే విధమైన సిండ్రోమ్‌ను ఫేస్ చేస్తోంది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, బ్రిటన్ యాక్సెంట్‌లో మాట్లాడుతుంది. బ్రిటన్‌కు చెందిన సారా కాల్విల్ అనే చైనా అమ్మాయి కూడా ఇలాంటి సిండ్రోమ్‌తోనే జీవించింది. 1907 నుంచి ఇప్పటివరకు 60కి పైగా కేసుల్లో ఈ సిండ్రోమ్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.