సంగం డైరీ విషయంలో కీలక ఆదేశాలిచ్చిన హైకోర్టు

దిశ, ఏపీ బ్యూరో: సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. జగన్ సర్కార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. అలాగే ప్రభుత్వం వేసిన ఇంప్లీడ్ పిటిషన్లను సైతం కొట్టివేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దంటూ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి గతంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని తీర్పును వెల్లడించింది. దీంతో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును […]

Update: 2021-09-01 05:56 GMT

దిశ, ఏపీ బ్యూరో: సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. జగన్ సర్కార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. అలాగే ప్రభుత్వం వేసిన ఇంప్లీడ్ పిటిషన్లను సైతం కొట్టివేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దంటూ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి గతంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని తీర్పును వెల్లడించింది. దీంతో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. దీంతో విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్‌ను తిరస్కరించింది.

Tags:    

Similar News