టీ-20 ప్రపంచకప్ వాయిదా వద్దు: మిస్బావుల్ హక్
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా వేయవద్దని పాక్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ కోరాడు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ స్తంభించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మెగా టోర్నీతో క్రికెట్ ప్రారంభిస్తే మరింత ఉత్సాహం వస్తుందన్నాడు. ఐసీసీ టోర్నీలో అన్ని దేశాలు పాల్గొంటాయి. దీంతో ఆటకు మంచి ఆదరణ లభిస్తుందని మిస్బా అన్నాడు. కరోనా అనంతరం 16 జట్లకు ఒక […]
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా వేయవద్దని పాక్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ కోరాడు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ స్తంభించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మెగా టోర్నీతో క్రికెట్ ప్రారంభిస్తే మరింత ఉత్సాహం వస్తుందన్నాడు. ఐసీసీ టోర్నీలో అన్ని దేశాలు పాల్గొంటాయి. దీంతో ఆటకు మంచి ఆదరణ లభిస్తుందని మిస్బా అన్నాడు. కరోనా అనంతరం 16 జట్లకు ఒక దేశం ఆతిథ్యం ఇవ్వడం కష్టమైన పనే అయినా ఏకపక్షంగా రద్దు చేయడం మంచిది కాదన్నాడు. అవసరమైతే నిర్వాహక దేశానికి కాస్త సమయం ఇచ్చి, ప్రపంచకప్ జరిగేలా చూడాలని ఐసీసీకి సూచించాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు పాకిస్తాన్ జట్టు వెళ్లబోతోందని, జట్టులోకి మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసి.. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉపయోగించుకుంటామని మిస్బా తెలిపాడు.