నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దు !

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: త్వరలో జరగనున్న గ్రేటర్ ఎలక్షన్స్‌లో నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఎన్నికల నిఘా వేదిక సభ్యుడు పద్మనాభరెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటింగ్ శాతం పెంచుట, ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులకు తోడ్పాటుపై 20స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే కార్పొరేటర్ల పాత్ర చాలా కీలకమని, ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి నేర చరిత లేని వారికి టికెట్లు […]

Update: 2020-11-04 10:05 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: త్వరలో జరగనున్న గ్రేటర్ ఎలక్షన్స్‌లో నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఎన్నికల నిఘా వేదిక సభ్యుడు పద్మనాభరెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటింగ్ శాతం పెంచుట, ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులకు తోడ్పాటుపై 20స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే కార్పొరేటర్ల పాత్ర చాలా కీలకమని, ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి నేర చరిత లేని వారికి టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News