పైరవీలను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష గీతా అర్చన కార్యక్రమానికి సంబంధించిన రథయాత్రను ఎమ్మెల్యే రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు.. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆసరాగా తోడ్పడుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల దృష్ట్యా పైరవీలను నమ్మకూడదని సూచించారు. ఎవరికీ ఎలాంటి […]
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష గీతా అర్చన కార్యక్రమానికి సంబంధించిన రథయాత్రను ఎమ్మెల్యే రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు.. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆసరాగా తోడ్పడుతుందని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల దృష్ట్యా పైరవీలను నమ్మకూడదని సూచించారు. ఎవరికీ ఎలాంటి అవసరం ఉన్నా నేరుగా వచ్చి చేసుకోవాలని మద్యవర్థులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, వెంకట్ గౌడ్, మచ్చ శ్రీనివాస్, సుంకోజి ప్రవీణ్, భద్రి తదితరులు పాల్గొన్నారు.