నా శవంపై ఆసుపత్రి నిర్మాణం చేసుకోండి.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: పేదల ఇళ్ల కోసం గద్వాల్ లో సేకరించిన భూమిని ముట్టుకుంటే ఉసురుకొట్టుకుపోతారని, తన శవంపై నర్సింగ్ కళాశాల, ఆసుపత్రి నిర్మాణం చేసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్ల కోసం కేటాయించిన భూమిలో కళాశాల వద్దని అడిగితే లాఠీలతో కొట్టడం హేయమన్నారు. కేసీఆర్, హరీష్ రావును లాఠీలతో కొడితే ఆ బాధేంటో తెలుస్తోందని తీవ్ర […]
దిశ, తెలంగాణ బ్యూరో: పేదల ఇళ్ల కోసం గద్వాల్ లో సేకరించిన భూమిని ముట్టుకుంటే ఉసురుకొట్టుకుపోతారని, తన శవంపై నర్సింగ్ కళాశాల, ఆసుపత్రి నిర్మాణం చేసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్ల కోసం కేటాయించిన భూమిలో కళాశాల వద్దని అడిగితే లాఠీలతో కొట్టడం హేయమన్నారు. కేసీఆర్, హరీష్ రావును లాఠీలతో కొడితే ఆ బాధేంటో తెలుస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు గద్వాల పర్యటనలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. అవగాహన లేకుండా మాట్లాడే సన్యాసులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల కోసం ఇచ్చిన భూములను సేకరించటానికి ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గద్వాల అభివృద్ధిపై మాట్లాడే అర్హత కేసీఆర్, హరీష్ రావుకు లేదన్నారు.
తనపై వ్యక్తిగత కక్షతో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూములు గుంజుకోవటం అన్యాయమని మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు దొంగతనంగా గద్వాల్ వచ్చి నర్సింగ్ కాలేజ్ కు ఫౌండేషన్ వేశారన్నారు. ప్రభుత్వ భవనాల కోసం గజం భూమిని కూడా సేకరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. యూనిఫాం వేసుకున్న పోలీసులు మానవత్వాన్ని కోల్పోతున్నారని ఆరోపించారు. గద్వాలలో 5 వేల మందికి ఇళ్లు ఇస్తామని తాను హామీ ఇవ్వలేదని లక్ష్మీనరసింహాస్వామిపై కేసీఆర్ ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అడిగినందుకు దాడులు చేయటం హేయమైన చర్య అన్నారు. సోషల్ వెల్ఫేర్ అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు.పేదల ఇళ్ల కోసం 2012లో 78ఎకరాల పట్టా భూమిని సేకరించి ప్రభుత్వానికిచ్చామని అన్నారు. బీజేపీ కార్యకర్త చెయ్యి విరగొట్టిన రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలొ బీజేపీ నాయకులు పాల్గొన్నారు