రాజ్యాంగాన్ని మంత్రి ఉల్లంఘిస్తున్నారు

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని బీజేపీ నేత డీకే అరుణ కోరారు. రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలను ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. సర్వేలు వ్యతిరేకంగా రావడాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. పోలీసులు గులాబీ చొక్కాలు వదిలి ఖాకీ చొక్కాలను వేసుకోవాలని ఆమె మండి పడ్డారు. పోస్టింగ్‌ల కోసం టీఆర్ఎస్ కు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు. ఆర్థిక మంత్రి హోదాలో రాజ్యాంగాన్ని హరీశ్ రావు ఉల్లంఘిస్తున్నారని […]

Update: 2020-10-26 06:46 GMT

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని బీజేపీ నేత డీకే అరుణ కోరారు. రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలను ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. సర్వేలు వ్యతిరేకంగా రావడాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. పోలీసులు గులాబీ చొక్కాలు వదిలి ఖాకీ చొక్కాలను వేసుకోవాలని ఆమె మండి పడ్డారు. పోస్టింగ్‌ల కోసం టీఆర్ఎస్ కు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు. ఆర్థిక మంత్రి హోదాలో రాజ్యాంగాన్ని హరీశ్ రావు ఉల్లంఘిస్తున్నారని ఆమె అన్నారు. దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్‌కు జ్ఞానోదయం కావాలని ఆమె అన్నారు.

Tags:    

Similar News