కేసీఆర్ ముందు తెలంగాణ రైతులను పట్టించుకోండి : డీకే అరుణ ఫైర్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హుజురాబాద్‌లో బీజేపీ సాధించిన విజయం, దళిత బంధు అమలుకు సంబంధించిన అంశాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం కేసీఆర్ రైతుల పేరిట ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆరోపించారు. సోమవారం ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేకపోవడం వల్ల ఎంతో మంది రైతుల గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోని సీఎం […]

Update: 2021-11-22 04:31 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హుజురాబాద్‌లో బీజేపీ సాధించిన విజయం, దళిత బంధు అమలుకు సంబంధించిన అంశాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం కేసీఆర్ రైతుల పేరిట ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆరోపించారు. సోమవారం ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేకపోవడం వల్ల ఎంతో మంది రైతుల గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోని సీఎం పక్క రాష్ట్రాల రైతులకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తారంటా అని ఎద్దేవ చేశారు.

ముఖ్యమంత్రి వ్యవహారం కన్న తల్లికి అన్నం పెట్టని కొడుకు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్లుగా ఉందని అరుణ పేర్కొన్నారు. కేసీఆర్‌కు ప్రజల ఓట్లు, తనకు సీట్లు అన్న భావనతోనే రకరకాల కుట్రలు పన్నుతున్నారని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్.. మద్యం టెండర్లు పేర్లతో కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచ నంబర్ వన్ దోపిడి దారుడికి ఇచ్చే అవార్డు ఏదైనా ఉంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవ్వవలసి ఉంటుందని అరుణ తెలిపారు.

epaper – 4:00 PM TS EDITION (22-11-21) చదవండి

 

Tags:    

Similar News