రేపు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్..

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ కోసం ఆదివారం వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్‌తో వరల్డ్ నెంబర్ 5 స్టెఫానో సిట్సిపాస్తలపడనున్నాను. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నదాల్‌ను నోవాక్ జకోవిచ్ 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో విజయం సాధించాడు. మొదటి సెట్‌ను నదాల్, రెండో సెట్‌ను జకోవిచ్ సునాయాసంగా గెలుచుకున్నారు. అయితే, మూడో సెట్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. టై బ్రేకర్‌లో జకోవిచ్ […]

Update: 2021-06-12 11:23 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ కోసం ఆదివారం వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్‌తో వరల్డ్ నెంబర్ 5 స్టెఫానో సిట్సిపాస్తలపడనున్నాను. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నదాల్‌ను నోవాక్ జకోవిచ్ 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో విజయం సాధించాడు. మొదటి సెట్‌ను నదాల్, రెండో సెట్‌ను జకోవిచ్ సునాయాసంగా గెలుచుకున్నారు. అయితే, మూడో సెట్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. టై బ్రేకర్‌లో జకోవిచ్ పై చేయి సాధించాడు. ఇక నాలుగో సెట్‌లో నదాల్‌ చేతులెత్తేశాడు. జకోవిచ్ తన పవర్ ఫుల్ షాట్లతో నదాల్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నదాల్‌ను రెండో సారి ఓడించి జకోవిచ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ ఆఫ్ ది డికేడ్‌గా వ్యవహరించిన సెమీఫైనల్‌లో జకోవిచ్‌దే పై చేయి అయ్యింది.

ఈ మ్యాచ్‌ను తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని జకోవిచ్ వ్యాఖ్యానించాడు. జకోవిచ్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఈ విజయానికి అతడు పూర్తిగా అర్హుడని నదాల్ పేర్కొన్నాడు. ఆదివారం రోలాండ్ గారోస్ వేదికగా జరుగనున్న ఫైనల్‌లో సిట్సిపాస్‌తో తలపడనున్నాను. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించిన సిట్సిపాస్‌కు ఇది ఒక పెద్ద పరీక్ష లాంటిదే. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే జకోవిచ్ ఖాతాలో 19 గ్రాండ్‌స్లామ్స్ చేరతాయి. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్స్ నదాల్, ఫెదరర్ తర్వాత స్థానంలో జకోవిచ్ ఉన్నాడు.

Tags:    

Similar News