డీజేతో దుమ్మురేపిన కుర్రాళ్లు.. దడుసుకొని సచ్చిన 63 కోళ్లు!

దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లి అయినా.. పండుగ అయినా డీజే పెట్టాల్సిందే.. దుమ్మురేపేలా ఎగరాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసిన బారాత్‌లు జరుగుతున్నాయి. అయితే, ఇదంతా కామన్.. మాకెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా?.. ఈ డీజే సౌండ్లే 63 కోళ్లను బలి తీసుకున్నాయ్ మరి. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే. ఒడిశాలోని బాలాసోర్‌లో ఓ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో డీజే పెట్టి కుర్రాళ్లు డ్యాన్సులు చేశారు. దాని పక్కనే కోళ్లఫామ్ ఉండటంతో […]

Update: 2021-11-24 09:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లి అయినా.. పండుగ అయినా డీజే పెట్టాల్సిందే.. దుమ్మురేపేలా ఎగరాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసిన బారాత్‌లు జరుగుతున్నాయి. అయితే, ఇదంతా కామన్.. మాకెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా?.. ఈ డీజే సౌండ్లే 63 కోళ్లను బలి తీసుకున్నాయ్ మరి. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే.

ఒడిశాలోని బాలాసోర్‌లో ఓ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో డీజే పెట్టి కుర్రాళ్లు డ్యాన్సులు చేశారు. దాని పక్కనే కోళ్లఫామ్ ఉండటంతో ఆ సౌండ్‌కు కోళ్లు గిలగిల కొట్టుకుంటుంటే డ్యాన్స్ చేస్తున్నాయనుకున్నారంతా. కానీ ఆ డీజే శబ్ధాలను భరించలేని 63 కోళ్లు చనిపోయాయి. ఒకేసారి అన్ని కోళ్లు చనిపోవడంతో కోళ్లఫామ్ యజమాని వెటర్నరీ డాక్టర్‌కు చూపించాడు. పరీక్షించిన డాక్టర్.. అవి గుండెపోటుతో చనిపోయాయని నిర్ధారించారు. కోళ్ల మరణానికి మితిమీరిన డీజే శబ్దాలే కారణం అని తెలిపారు. వెంటనే యజమాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నష్టపరిహారం చెల్లించి, డీజే పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Tags:    

Similar News