వినూత్న రీతిలో దీపావళి సెలబ్రేషన్స్..
దిశ, కోదాడ : కోదాడ పట్టణంలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో బుధవారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో కరోనా దిష్టిబొమ్మను తయారు చేసి దగ్ధం చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలని, పండగల ప్రాధాన్యతను గుర్తించి జరుపుకోవాలని అన్నారు. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయమని అన్నారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ విశిష్టత విద్యార్థులకు వివరించారు. ఈ దీపావళితో గతంలో ఉన్న […]
దిశ, కోదాడ : కోదాడ పట్టణంలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో బుధవారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో కరోనా దిష్టిబొమ్మను తయారు చేసి దగ్ధం చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలని, పండగల ప్రాధాన్యతను గుర్తించి జరుపుకోవాలని అన్నారు. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయమని అన్నారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ విశిష్టత విద్యార్థులకు వివరించారు. ఈ దీపావళితో గతంలో ఉన్న ఇబ్బందులు కరోనా మహమ్మారి వంటి వైరస్‌లు నశించిపోయి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నారు. అనంతరం విద్యార్థుల చేత దీపాలు వెలిగించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.