ఎలాంటి తీర్పు వస్తుందో.. హైకోర్టుకు 'వకీల్ సాబ్'

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. దీనిపై ఏపీ ప్రభుత్వం మొండివైఖరితో ఉండగా.. టికెట్ రేట్ల పెంపును నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు న్యాయపోరాటం చేస్తున్నాయి. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో పాటు టికెట్ ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం […]

Update: 2021-04-11 21:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. దీనిపై ఏపీ ప్రభుత్వం మొండివైఖరితో ఉండగా.. టికెట్ రేట్ల పెంపును నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు న్యాయపోరాటం చేస్తున్నాయి. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో పాటు టికెట్ ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది.

రాజకీయంగా పవన్‌పై ఉన్న కక్షతోనే వకీల్ సాబ్ సినిమాకి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ జీవోపై థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా..మూడు రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది

సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన డివిజన్ బెంచ్.. కేవలం శనివారం మాత్రమే టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో టికెట్ల ధరలు పెంచుకోవాల్సిందిగా అనుమతి ఇవ్వాలంటూ నేడు థియేటర్ల యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు మరోసారి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కొత్త జీవో వచ్చేంతవరకు పాత ధరలను అమలు చేయాలని హైకోర్టును కోరనున్నారు.

Tags:    

Similar News