ముషీరాబాద్‌లో కూరగాయల పంపిణీ
దిశ, హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో యువ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కూరగాయాల పంపిణీ చేపట్టారు. చిక్కడపల్లి ఈ సేవా, బాగ్‌లింగంపల్లి, గాంధీనగర్ ప్రాంతాల్లో వ్యాన్లలో తిరుగుతూ యువ పార్టీ అధ్యక్షుడు చందు బెట్ల 300 పేద కుటుంబాలకు 3 క్వింటాళ్ల కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా బస్తీల్లోని పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి సాయం అందించాలనే ఉద్దేశంతోనే కూరగాయల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఇంకా ఎవరికైనా నిత్యావసరాలు కావాలంటే యువ […]
దిశ, హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో యువ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కూరగాయాల పంపిణీ చేపట్టారు. చిక్కడపల్లి ఈ సేవా, బాగ్‌లింగంపల్లి, గాంధీనగర్ ప్రాంతాల్లో వ్యాన్లలో తిరుగుతూ యువ పార్టీ అధ్యక్షుడు చందు బెట్ల 300 పేద కుటుంబాలకు 3 క్వింటాళ్ల కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా బస్తీల్లోని పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి సాయం అందించాలనే ఉద్దేశంతోనే కూరగాయల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఇంకా ఎవరికైనా నిత్యావసరాలు కావాలంటే యువ పార్టీ కార్యాలయానికి వస్తే సమకూరుస్తానని పేర్కొన్నారు.
Tags: Musheerabad, Youth Party, Vegetable Distribution