బందోబస్తు నడుమ రేషన్ పంపిణీ
దిశ, మెదక్: రేషన్ షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని రేషన్ షాపుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి రేషన్ షాప్ వద్ద సామాజిక దూరం ఉండేటట్లు మార్కింగ్ ఏర్పాటు చేశారు. రేషన్‌కు వచ్చే ప్రజలకు ఈ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి అవగాహన కల్పిస్తూ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రేషన్ తీసుకొని వెళ్ళిన […]
దిశ, మెదక్: రేషన్ షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని రేషన్ షాపుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి రేషన్ షాప్ వద్ద సామాజిక దూరం ఉండేటట్లు మార్కింగ్ ఏర్పాటు చేశారు. రేషన్‌కు వచ్చే ప్రజలకు ఈ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి అవగాహన కల్పిస్తూ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రేషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్లగానే చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కొవాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.
Tags: Distribution, ration, among, Bondobastu, siddipet