ఉపాధి హామీ కూలీలకు మాస్కుల పంపిణీ

దిశ,మునుగోడు: ఉపాధి హామీ కూలీలకు నారాయణపురలో కాంగ్రెస్ నాయకులు శనివారం మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా ప్రోత్సహించాలనే సంకల్పంతోనే ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఆపత్కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా నిరుపేదలకు అండగా ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉప్పల […]

Update: 2021-05-22 05:28 GMT

దిశ,మునుగోడు: ఉపాధి హామీ కూలీలకు నారాయణపురలో కాంగ్రెస్ నాయకులు శనివారం మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా ప్రోత్సహించాలనే సంకల్పంతోనే ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఆపత్కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా నిరుపేదలకు అండగా ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, కొండ్రెడ్డి నరసింహ, ఉపసర్పంచ్ ఉప్పరగోని సంజీవ, ఉప్పల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News