రంగారెడ్డిలో వలస కార్మికులకు నగదు పంపిణీ
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 నగదును ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో పంపిణీ చేసేందుకు రూ.1,89,47,000 నగదును ఆర్దీఓలకు విడుదల చేస్తూ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 37 వేల 894 మంది వలస కార్మికులు ఉన్నట్టు గుర్తించామన్నారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లకు వలస కార్మికుల జాబితాను అనుసరించి నగదు పంపిణీ చేయడానికి మార్చి 31న నిధులను […]
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 నగదును ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో పంపిణీ చేసేందుకు రూ.1,89,47,000 నగదును ఆర్దీఓలకు విడుదల చేస్తూ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 37 వేల 894 మంది వలస కార్మికులు ఉన్నట్టు గుర్తించామన్నారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లకు వలస కార్మికుల జాబితాను అనుసరించి నగదు పంపిణీ చేయడానికి మార్చి 31న నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయా ప్రాంతాల్లోని వలస కార్మికులకు నగదు పంపిణీ చేశారు.
Tags: Distribution, cash, migrant workers, rangareddy