బ్రహ్మంగారి మఠంలో కొట్లాట.. కేసు నమోదు

దిశ, ఏపీ బ్యూరో: బ్రహ్మంగారి మఠంలో వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నూతన పీఠాధిపతి ఎంపిక విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొంది. పీఠాధిపతి ఎంపిక విషయంలో దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటే శ్వరస్వామి కుటుంబ సభ్యుల్లో ఆధిపత్య పోరు నెలకొంది. పీఠాధిపతి మరణించడంతో పెద్ద భార్య, రెండో భార్య కుమారులు పిఠాధిపతి కావాలని పట్టుబట్టారు. దీంతో వివాదం ముదిరి ప్రభుత్వం వరకు వెళ్లింది. దీంతో ప్రభుత్వం కమిటీ వేసింది. 20 నుంచి 25 మంది పీఠాధితులు […]

Update: 2021-06-15 05:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: బ్రహ్మంగారి మఠంలో వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నూతన పీఠాధిపతి ఎంపిక విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొంది. పీఠాధిపతి ఎంపిక విషయంలో దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటే శ్వరస్వామి కుటుంబ సభ్యుల్లో ఆధిపత్య పోరు నెలకొంది. పీఠాధిపతి మరణించడంతో పెద్ద భార్య, రెండో భార్య కుమారులు పిఠాధిపతి కావాలని పట్టుబట్టారు. దీంతో వివాదం ముదిరి ప్రభుత్వం వరకు వెళ్లింది. దీంతో ప్రభుత్వం కమిటీ వేసింది. 20 నుంచి 25 మంది పీఠాధితులు వివిధ సంఘాలతో భేటీ అయి అభిప్రాయాలను తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశ్వబ్రాహ్మణ సంఘాలు, స్థానికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంకు శీను, దీప్తి రమణారెడ్డి, బాబ్జి, శ్రీరాములు, నారాయణ రెడ్డి అనే వ్యక్తులు శ్రీకాంత్‌పై దాడికి పాల్పడినట్టు గుర్తించి వారిపై పోలీసులు 452, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మెుత్తం మీద పీఠాధిపతి ఎంపిక విషయంలో నెలకొన్న వివాదం ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News