భారత్‌కు మరో పతకం..? డిస్క్ త్రోలో కమల్ ప్రీత్ ‘కమాల్’

దిశ, వెబ్‌డెస్క్ : ఒలింపిక్‌లో పతకాలు సాధించడమే ధ్యేయంగా భారత అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాడ్మింటన్ విభాగంలో ఇప్పటికే పీవీ సింధు సెమీస్‌కు చేరుకోగా.. ఇందులో గెలిస్తే భారత్‌కు పతకం ఖాయం. అదే బాటలో డిస్క్ త్రో విభాగంలో కమల్ ప్రీత్ సైతం ఫైనల్‌కు చేరుకుంది. తాను కూడా ఫైనల్స్‌లో సత్తా చాటితే దేశానికి మరో ఒలింపిక్ మెడల్ పదిలం కానుంది. క్వాలిఫైయింగ్ రౌండ్‌ లో రెండో స్థానంలో నిలిచిన కమల్ ప్రీత్.. ఫస్ట్ రౌండ్‌లో 60.29మీటర్లు, […]

Update: 2021-07-30 23:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఒలింపిక్‌లో పతకాలు సాధించడమే ధ్యేయంగా భారత అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాడ్మింటన్ విభాగంలో ఇప్పటికే పీవీ సింధు సెమీస్‌కు చేరుకోగా.. ఇందులో గెలిస్తే భారత్‌కు పతకం ఖాయం. అదే బాటలో డిస్క్ త్రో విభాగంలో కమల్ ప్రీత్ సైతం ఫైనల్‌కు చేరుకుంది. తాను కూడా ఫైనల్స్‌లో సత్తా చాటితే దేశానికి మరో ఒలింపిక్ మెడల్ పదిలం కానుంది.

క్వాలిఫైయింగ్ రౌండ్‌ లో రెండో స్థానంలో నిలిచిన కమల్ ప్రీత్.. ఫస్ట్ రౌండ్‌లో 60.29మీటర్లు, సెకండ్ రౌండ్‌లో 63.97మీటర్లు, మూడో ప్రయత్నంలో 64 మీటర్ల దూరం డిస్క్ విసిరి ఫైనల్ కు అర్హత సాధించింది. మరో భారత ప్లేయర్ సీమా పూనియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది. మొదటి నుంచి 12 స్థానాల్లో నిలిచిన వారిని ఫైనల్‌కు ఎంపిక చేశారు. రేపు డిస్క్ త్రో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచినా భారత్‌కు పతకం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News